ఆహార పదార్ధాల తయారీలో వినియోగించే పసుపు ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తుందని ఎంతోమందికి తెలుసు? ఆహార పదార్ధాలకు రుచిని చేకూర్చే ఈ పసుపు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలని కూడా కలిగిస్తుంది. పసుపుతో సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? పసుపును ఉపయోగించి వివిధ చర్మ సమస్యలు తొలగించుకోవచ్చు. ఆరోగ్యానికి అవసరమయ్యే పలు ఔషధాలలో పసుపును విరివిగా వినియోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ బయాటిక్ లక్షణాలు పలు సమస్యల నుంచి దూరం చేస్తాయి. వంట ఇంట్లో నిత్యం అందుబాటులో ఉండే పసుపు వల్ల మీ చర్మానికి , ముఖానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, లాభాలను ఇస్తాయి.
పసుపు వినియోగంతో లాభాలు:
* చర్మంలో కొల్లాజెన్, తేమ స్థాయిని సమతుల్యం చేసేందుకు పసుపు సహాయపడుతుంది. అదే విధంగా వృద్ధాప్యానికి కారణమయ్యే కణాలను సైతం చర్మం నుంచి బయటకు పంపిస్తుంది.
* చర్మ సంబంధిత తామర, సోరియాసిస్ సహా మరిన్ని చర్మ సమస్యలకు పరిష్కారం చూపడంలో తోడ్పడుతుంది. పలు చర్మ సమస్యల చికిత్సకు సహాయపడే రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.
* అతినీల లోహిత కిరణాలు అధికంగా ముఖంపై పడటం వల్ల చర్మం దెబ్బతింటుంది. తరచుగా పసుపును మీ చర్మానికి రాయడం వల్ల ఈ కిరణాల వల్ల ఎదురయ్యే సమస్యను నివారించవచ్చు. పసుపు చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు ప్రశాంతతను కలిగిస్తుంది.
* చర్మంపై మలినాలను తొలగించి మిమ్మల్ని మరింత ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.
* నల్ల మచ్చలు, మొటిమలను కలగజేసే ఎంజైమ్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీంతో మొటిమలు, మచ్చల సమస్య పరిష్కారమవుతుంది.