సినీప్రియుల్ని భయపెట్టి.. థ్రిల్ చేసిన ‘చంద్రముఖి’ మరోసారి బాక్సాఫీస్
ముందుకొస్తోంది. పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిట్ చిత్రానికి ఇప్పుడు
‘చంద్రముఖి 2’ సిద్ధమైంది. తొలి భాగంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించగా.. ఈ
సీక్వెల్లో రాఘవ లారెన్స్ హీరోగా కనిపించనున్నారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో
నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమా
వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం
అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు లారెన్స్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది.
అందులో ఆయన చంద్రముఖి గది ద్వారం వద్ద నిలబడి తలుపు రంద్రం గుండా లోపలికి
చూస్తూ కనిపించారు. ఈ సందర్భంగా నిర్మాత సుభాస్కరన్ మాట్లాడుతూ.. “భారతీయ
సినిమా చరిత్రలో ‘చంద్రముఖి’కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. దానికి సీక్వెల్ గా
వస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాం. ఇది ప్రేక్షకుల
అంచనాల్ని మించేలా ఉంటుంది” అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:కీరవాణి.