వా నువ్వు కావాలయ్యా… అంటూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది కథానాయిక తమన్నా.
భాషతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ భామ. తాజాగా నిఖిల్
అడ్వాణీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వేదా’లో తమన్నా ఓ కీలక పాత్రలో
నటిస్తున్నట్లు చిత్రబృందం గురువారం తెలిపింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల
ద్వారా తెలుపుతూ ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా తమన్నా
మాట్లాడుతూ ‘నిఖిల్ తన కథలను చెప్పే విధానాన్ని నేను ఎప్పుడూ మెచ్చుకుంటాను.
ఇందులో ఆయనకి మంచి సామర్థ్యం, నేర్పు ఉంది. జాన్ నేను మొదటిసారి కలిసి పని
చేస్తున్నాము. ఇందులో నా పాత్ర ఎలా ఉండనుందోనని చాలా ఉత్సాహంగా ఉంది’ అని
చెప్పుకొచ్చింది. జాన్ అబ్రహం, శర్వరి వాగ్, అభిషేక్ బెనర్జీ ఈ సినిమాలో
ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా
చిత్రీకరణను ఇటీవలే రాజస్థాన్ లో ప్రారంభించారు.