పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్
విజయవాడ : నూతన సంవత్సర వేళ ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో గడపడం చాలా సంతోషంగా ఉందని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అన్నారు. ఆదివారం విజయవాడ కృష్ణలంకలోని నిర్మలా శిశుభవన్ లో పిల్లలతో కేక్ కోయించి కాసేపు వారితో ముచ్చటించారు. దివ్యాంగుల సర్వతోముఖాభివృద్ధికి విద్యాశాఖ, సమగ్ర శిక్షా తరఫున కృషి చేస్తామని అన్నారు. అనంతరం ప్రత్యేక అవసరాల పిల్లలు ప్రదర్శించిన నృత్యాలను చూసి వారిని అభినందించారు. ప్రవీణ్ ప్రకాశ్ తో పాటు సమగ్ర శిక్షా ఎస్ఏపీడీ బి.శ్రీనివాసరావు, ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి, సమగ్ర శిక్షా సిబ్బంది పాల్గొన్నారు.