విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరానికి చెందిన చింతలపూడి వెంకటేశ్వరరావు కి ఢిల్లీలో మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్,మెజీషియన్ డా. సి.పి.యాదవ్, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ జర్వాస్ ప్రెసిడెంట్ అనుపమ త్రిగునాయత్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా చింతలపూడి వెంకటేశ్వరరావు మాట్లాడారు. తన కుటుంబం మొత్తం ఆయుర్వేదిక వైద్యులుగా గ్రామీణ వైద్యులుగా ఇప్పటివరకు ప్రజలకు సేవలు అందిస్తున్నారని అదే కోవలో 25 సంవత్సరాల నుంచి ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ అదే క్రమంలో అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నట్టు చెప్పారు. సంవత్సరాలుగా ఎన్నో సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, అవార్డులు తీసుకున్నందు వల్ల మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు నా సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేయడం చాలా సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకా సమస్త హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఈవో డా.కె.సురేష్,స్టేట్ జనరల్ సెక్రెటరీ జి.మహేష్ నాయుడు, నెల్లూరు టౌన్ చైర్మన్ వినుకొండ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.