అల్లుడు తో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి
విజయవాడ : స్థానిక చిట్టినగర్ 48వ డివిజన్ మోతీ మసీద్ ప్రాంగణంలో వున్న షాధి
ఖానా లో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ గని చిచా,
హబిబుల్లా, అధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ విందులో ముస్లిం సోదరులతో
కలిసి మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు
పాల్గొని ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ ప్రసిద్ది చెందిన ఈద్గా లో పాల్గొనటం
జరిగింది. ఈ నెలలో ప్రతి రోజు ముస్లిం సోదరులతో కలిసి వుంటా అని తెలిపారు.
అందరూ సంతోషంగా ఉండాలని అల్లా ఆశీస్సులు వుండాలని కోరుతున్నన్నారు ఈ
కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, వెలంపల్లి అల్లుడు చక్రవర్తి, ఎంబిఎస్
బాషా,వక్ఫ్ బోర్డ్ ఖాజా, రాయన నరేంద్ర, జిల్లా వక్ఫ్ బోర్డ్ గౌస్ మొహిద్దిన్,
ఆత్తులురి పెద్దబాబు, ఖాజా, అయితా కిషోర్, పిళ్లా జగ్గు,54వ డివిజన్
కార్పొరేటర్ ఆర్షద్ మైనారిటీ పెద్దలు పాల్గొన్నారు.