విజయవాడ : స్థానిక 48వ డివిజన్ గాంధీజీ చిట్టి నగర్ లో గల ఈద్గా గ్రౌండ్ నందు
గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా మైనారిటీ సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు
ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఏర్పాట్లు అన్ని మంచిగా చేయాలని ఆ గ్రౌండ్ ను
బుధవారం మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు
పరిశీలించారు.

ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ మైనారిటీ సోదరులు ఎంతో పవిత్రంగా
నిర్వహించుకునే బక్రీద్ పండుగ రోజున ఈ గ్రౌండ్ నందు ప్రత్యేక ప్రార్ధనలు
నిర్వహించుకుంటారు అని వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని నగర పాలక సంస్థ
అధికారులును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఈద్గా అధ్యక్షులు ఖాజా,
మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.