విజయవాడ : స్థానిక 52వ డివిజన్ లోని 115వ సచివాలయం పరిధిలో 176వ రోజు
శుక్రవారం గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో
ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ
శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ఆయా ప్రాంతాలలో పర్యటించి గడప
గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల
వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వెలంపల్లి
మాట్లాడుతూ పార్టీ నాయకులు, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గడప గడపకు
వెళ్తున్నామన్నారు. ఈ రోజు కొండా ప్రాంతంలో పర్యటించడం జరిగిందన్నారు. గతంలో
చంద్రబాబు హయాంలో ఒక్క అభివృద్ది పనులు కూడా చెయ్యలేదన్నారు. బుద్దా వెంకన్న
తను నివసించే డివిజన్ ను అభివృద్ది పరుచుకొలేని దద్దమ్మ అని అన్నారు. ఇక్కడ
అన్ని అభివృద్ది పనులు మా హయాంలో చేస్తున్నామన్నారు. అందరికీ అన్నీ పథకాలు
ఇస్తున్నామన్నారు. మా దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడిక్కడే
పరిష్కారిస్తున్నామన్నారు. చంద్రబాబే జగన్ మోహన్ రెడ్డి ను ఎదుర్కోలేక పోయాడు
లోకేష్ ఏమి చేస్తాడని ఎద్దేవా చేశారు. అందరూ పాదయాత్ర చేస్తే సీఎం
అవ్వలేరన్నారు. లోకేష్ పుష్టిగా తినడం కోసమే పాదయాత్ర చేస్తున్నాడన్నారు.
చిత్తశుద్ది లేని యాత్రలు ఎన్ని చేసిన లాభం లేదన్నారు.ఒక మంచి గొలుతో జగన్
పాదయాత్ర చేశారన్నారు. ఆ ముగ్గురు పాదయాత్ర లు చెయ్యడం వల్ల ఉపయోగం లేదన్నారు.
వాళ్ళు ఈ రాష్ట్రానికి పనికిరానివారన్నారు. సీఎం గా పోటీ చేస్తా అనే దమ్ము
దైర్యం పవన్ కళ్యాణ్ కి వుంద అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వ్యూహం అంతా
చంద్రబాబు నీ ముఖ్యమంత్రిని చెయ్యడమే అని అన్నారు. వాళ్ళు తెలంగాణ వాసులు
అన్నారు. వాళ్ల అవసరం ఆంధ్ర లో లేదన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన
భాగ్యలక్ష్మి,52వ డివిజన్ వైసీపీ ఇంచార్జీ తంగెళ్ళ రాము డివిజన్ నాయకులు
కార్యకర్తలు,వివిధ డివిజన్ల కార్పొరేటర్లు,వివిధ కార్పొరేషన్ల చేర్మెన్లు,
డైరెక్టర్లు,పార్టీ నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటరీస్, నగరపాలక
సంస్థ, రెవిన్యు తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.