తిరుపతి : శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారి
బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు శ్రీనివాసుడు
శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. భక్తులు
అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు,
వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే
ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి
వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన
విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి
ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి
విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల
చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం. స్నపన తిరుమంజనం : అనంతరం ఉదయం 11 నుండి
మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు వేడుకగా
స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు,
పసుపు, చందనంలతో అభిషేకం చేపట్టారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనంపై
స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ
ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ చెంగల్రాయులు,
కంకణ భట్టార్ బాలాజి రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్
రెడ్డి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.