న్యూఢిల్లీ : భారత్లో కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ప్రతికూల పరిస్థితులు అనీు ఇన్నీ కావు. దేశ ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కేంద్ర సర్కారు విధించిన ప్రణాళిక లేని లాక్డౌన్ పరిస్థితులను మరింత కఠినతరం చేసింది. ఈ ప్రభావం వ్యాపార, వాణిజ్యాల పైనే కాకుండా విద్య పైనా పడింది. విద్యార్థులను చదువుకుదూరమయ్యేలా చేసింది. లాక్డౌన్ కారణంగా దేశంలో పాఠశాలల మూసివేత తర్వాత 19 నెలల పాటు 43 శాతం మంది విద్యార్థులకు ఎలాంటి ఆన్లైన్ విద్యనూ పొందలేకపోయారు. ‘అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ (ఒఒసిసి)’ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
‘క్లియరింగ్ ది ఎయిర్ : ఎ సింథసైజ్డ్ మ్యాపింగ్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ డ్యూరింగ్ కోవిడ్-19 ఇన్ ఇండియా (ఏప్రిల్ 2020-మే 2022)’ పేరుతో న్యూఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ దీనినివిడుదల చేసింది. ఏప్రిల్ 2020- మే 2022 మధ్య ప్రచురించబడిన ఇతర అధ్యయనాలను పరిగణలోకి తీసుకోకుండా, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (యుడిఐఎస్ఇ), వార్షిక విద్యా స్థితి నివేదిక (ఎఎస్ఇఆర్) డేటాతో సహా 21 ప్రాథమిక అధ్యయన మూలాలను ఉపయోగించి నివేదికను రూపొందించారు.
స్కూళ్ల మూసివేతతో పిల్లలపై ప్రభావం
ఈ నివేదిక సమాచారం ప్రకారం ” ఏ ఆన్లైన్ విద్యనూ అందుకోని(పాఠశాల మూసివేత ప్రారంభం నుంచి సర్వే సమయం వరకు)” పిల్లల సంఖ్య 10 శాతం నుంచి 60 శాతం వరకు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ” మహమ్మారి సమయంలో స్మార్ట్ఫోన్ల వ్యాప్తి పెరిగినట్టు కొనిు ఆధారాలున్నప్పటికీ, 43 శాతం మంది పిల్లలు 19 నెలల వరకు ఎలాంటి పాఠశాల విద్యను పొందలేకపోయారు (డిజిటల్ మోడ్ విద్య అందుబాటులో లేకపోవటం లేదా డిజిటల్ విద్య అందించనిపాఠశాలలో చేరడం కారణంగా)” అని థింక్ ట్యాంక్ వెబ్సైట్ పేర్కొన్నది. మహమ్మారి కారణంగా స్కూళ్ల మూసివేతతో పిల్లలు ఎక్కువగా ప్రభావితమయ్యారని నివేదిక వివరించింది. విద్యాపరమైన అంతరాలు, విద్యా సామాగ్రి, పరికరాలు, ఇంటరొట్, పాఠశాల విద్యను కొనసాగించటానికి ఇతర ప్రాథమిక వనరులను పొందటంలో వివిధ సామాజిక-ఆర్థిక సందర్భాలలో పిల్లలు తీవ్రంగా ప్రభావితమయ్యారని పేర్కొన్నది.
డ్రాపౌట్లు తీవ్రం
మహమ్మారి కాలంలో పాఠశాలల్లో డ్రాపౌట్లు 1.3 శాతం నుంచి 43.5 శాతం వరకు ఉన్నదని నివేదిక పేర్కొన్నది. ఎఎస్ఇఆర్ సెంటర్ 2018 డేటా ప్రకారం కరోనా మహమ్మారి ముందును అంచనా గ్రామీణ భారత్లోని ఒఒఎస్సి జనాభా 2.5 శాతం కంటే దేశవ్యాప్త ఒఒఎస్సి జనాభా ముందస్తు అంచనాల కంటే ఎగువ శ్రేణి (43.5 శాతం) గణనీయంగా ఎక్కువగా ఉన్నదని నివేదిక పేర్కొన్నది. మహమ్మారి కారణంగా కొత్త ఆందోళనలు ఉద్భవించాయని నివేదిక వివరించింది. ” చిను పిల్లలలో డ్రాపౌట్లు పెరిగాయి. వలస చిన్నారులు ఎదుర్కొంటును సవాళ్లను మరింత తీవ్రతరం చేసింది. తక్కువ ఫీజుతో ప్రయివేటు పాఠశాలల్లో చేరిన పిల్లల దుర్భలత్వం పెరిగింది” అని నివేదిక పేర్కొన్నది