విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చం నాయుడు ఆధ్వర్యంలో జోన్ 1, ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో సోమవారం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ బలపరచిన అభ్యర్థిని గాడు చిన్ని కుమారి లక్ష్మి గెలుపే ధ్యేయంగా కృషి చేయాలని నియోజకవర్గ ఇన్చార్జిలకు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిటీ నియమించారు. ఈ సమావేశమునకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు , మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు , కిమిడి కళా వెంకట్రావు, నిమ్మకాయల చిన్నరాజప్ప, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, రాష్ట్ర మహిళ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, విజయనగరం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, పీవీజీ ర్ నాయుడు గణబాబు, ఎంఎల్సీ దువ్వారపు రామారావు, నియోజవర్గం ఇంచార్జ్ కోళ్ల లలిత కుమారి, గండి బాబ్జి, పీలాగోవింద సత్యనారాయణ,కోరాడ రాజబాబు,గిడ్డి ఈశ్వరి,పీవీజీ కుమార్, బత్తుల తాతయ్య బాబు, ప్రగాఢ నాగేశ్వరరావు, నిమ్మ జయకృష్ణ, టీ జగదీశ్వర్ రావు, కె వి వెంకటరమణ, బొగ్గు రమణమూర్తి, కొండపల్లి అప్పలనాయుడు, పత్తివాడ నారాయణస్వామి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం డి నజీర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పిలా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.