హోం శాఖ మంత్రి తానేటి వనిత
కొవ్వూరు : తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామంలో జరిగిన చైల్డ్రన్స్ డే
సెలబ్రేషన్స్ లో హోం శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్
విద్యార్ధులను ఉద్దేశించి హోంమంత్రి మాట్లాడారు. భారత మాజీ ప్రధాని నెహ్రుకు
చిన్నారులంటే చాలా ఇష్టమని, ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా నవంబర్ 14 న
బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు హోంమంత్రి వనిత పేర్కొన్నారు. అనంతరం
స్కూల్ విద్యార్థులు, చిన్నారులతో హోం మినిస్టర్ సరదగా ముచ్చటించారు. చిన్న
వయసులోనే లక్ష్యాలను నిర్ధేశించుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని
విద్యార్థులకు హోంమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ఆంద్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని హోంమంత్రి
తానేటి వనిత స్పష్టంచేశారు. నాడు నేడు లో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలల
రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ
పెట్టడం వలన విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు పునాదులు వేసినట్లు పేర్కొన్నారు.
విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసిన సీఎం జగన్ కి హోంమంత్రి తానేటి వనిత
ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.