ఇటీవల ‘భోళా శంకర్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ఈ చిత్రం భారీ
విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ‘భోళా శంకర్’తో భారీగా నష్టపోయిన నిర్మాత
అనిల్ సుంకరకు చిరు పారితోషికం వెనక్కి ఇచ్చి ఆదుకొన్నట్టు టాలీవుడ్ వర్గాలు
చెబుతున్నాయి. ఇటీవల చిరు మోకాలికి ఆపరేషన్ జరిగింది. ఇప్పుడాయన
కోలుకొంటున్నారు. ఆగస్టు 22న పుట్టిన రోజు సందర్భంగా చిరు కొత్త సినిమాకి
సంబంధించిన ప్రకటన రావాల్సివుంది. అయితే ‘భోళా… ఎఫెక్టుతో చిరు పునరాలోచనలో
పడినట్టు టాక్. ఆయన ముందు వశిష్ట, కల్యాణ్ కృష్ణ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ
రెండు సినిమాల్నీ ఒకేసారి సమాంతరంగా ప్రారంభించాలని చిరు అనుకొన్నారు. అయితే
ఇప్పుడు ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలనుకొంటున్నారట. మరోవైపు చిరంజీవి కోసం మరో
ఇద్దరు దర్శకులు కథలతో రెడీగా ఉన్నట్టు టాక్. చిరుతో ‘స్టాలిన్’ తెరకెక్కించిన
మురుగదాస్ ఇప్పుడు మరో కథ సిద్ధం చేశారని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ ఈ
చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. చిరుకి బాగా కలిసొచ్చిన వి.వి.వినాయక్
కూడా క్యూలో ఉన్నారు. ‘ఖైది నెం.150’ తరవాత ఈ కాంబినేషన్ కుదరడం ఇదే తొలిసారి.
వినాయక్ చెప్పిన కథ చిరుకి నచ్చిందని, దాన్ని కూడా చిరు హోల్లో పెట్టారని
టాక్. ఈ నెలాఖారుకి చిరు తదుపరి సినిమా విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశాలు
ఉన్నాయి.