విజయవాడ : స్థానిక బ్రాహ్మణ వీధిలో గల మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన
సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ఇంటి వద్ద వెలంపల్లి ఫౌండేషన్ సభ్యులైన
వెలంపల్లి రాఘవ నరసింహారావు, కొనకళ్ల విద్యాధర రావు ఇరువురు కలిసి 47,49
డివిజన్లకు చెందిన ముగ్గురు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను గురువారం పంపిణీ
చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 47,49 డివిజన్లలో పర్యటిస్తున్నా
క్రమంలో చిరు వ్యాపార్లు తమకు బండి కావాలని ప్రస్తుతం ఉన్న బళ్ళు పాడై
ఇబ్బందులు పడుతున్నామని, కొంచెం చేయూత అందించాలని మాజీ మంత్రి పశ్చిమ
నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ను కోరగా వారికి బుధవారం
వెలంపల్లి ఫౌండేషన్ తరపున వీరు ఇరువురు కలిసి అందించారు.ఈ కార్యక్రమంలో 47వ
డివిజన్ వైసీపీ నాయకులు గోదావరి బాబు, తదితరులు పాల్గొన్నారు.