నిజం. ఓ పద్ధతి ప్రకారం తాగితే బరువు తగ్గడమే కాదు పొట్ట కూడా తగ్గిపోతుంది.
ఎలా అంటే..?
ఈ రోజుల్లో నూటికి 80 శాతం మందికి పొట్ట తగ్గడం, బరువు తగ్గడం అనేది పెద్ద
సమస్య. అయితే ఫైబర్, ముఖ్యమైన పోషకాలతో ఉండే చెరుకు రసం మన బరువు తగ్గించగలదు.
ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వును కరిగిస్తుంది. అంతేకాదు ఇందులోని
ఫ్లైవనాయిడ్స్, పాలీఫెనోలిక్ కాంపౌండ్లు,యాంటీఆక్సిడెంట్లు మనలో వ్యాధినిరోధక
శక్తిని పెంచుతాయి మరియు వ్యాధులు రాకుండా చేస్తాయి.
రోజూ ఓ గ్లాస్ చెరుకు రసం తాగటం వల్ల ఇందులో ఉండే ఫైబర్ తో పాటూ ప్రోటీన్లు,
పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, అమైనా యాసిడ్లు ఉంటాయి. ఇవి మన శరీరంలో అధిక
బరువును తగ్గిస్తాయి. అంతే కాదు కాన్సర్ వచ్చే ప్రమాదాన్ని ఈ డ్రింక్
తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
చెరుకు రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. 220 గ్రాముల చెరుకు రసంలో 180కేలరీల
శక్తి ఉంటుంది. పంచదార 30 గ్రాములు మాత్రమే ఉంటుంది. మన శరీరంలో అనవసరంగా ఉండే
LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిసెరైడ్స్నే కరిగిస్తుంది. వీటి వల్లే మనం బరువు
పెరుగుతూ ఉంటాం. ఇవి మన శరీరంలో పెరిగే కొద్దీ గుండె సంబంధిత జబ్బులు వచ్చే
ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి
ఈ కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాల్సిందే.
చెరుకు రసం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. మన కిడ్నీలు, లివర్ బాగా
పనిచేస్తాయి. చాలా రోగాలు నయమవుతాయి. కాన్సర్, జాండీస్ లాంటివి కూడా
తగ్గుతాయి. చెరుకు రసంలోని పొటాషియం మన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసేలా
చేస్తుంది.
చెరుకు రసంలోని గ్లిసెమిక్ ఇండెక్స్ మన బ్లడ్ షుగర్ స్థాయిని రెగ్యులేట్
చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కూడా కొద్ది మొత్తంలో చెరుకు రసం
తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. చెరుకు రసం ముసలితనం రాకుండా కూడా చేస్తుంది
మరియు చర్మాన్ని కాపాడుతుంది.
చెరుకు రసం తాగటం వల్ల మొటిమలు, మచ్చల్ని తగ్గిస్తుంది. ఎముకలు, దంతాలు కూడా
చక్కగా ఉంటాయి అయితే రోజుకు ఒక గ్లాస్ మాత్రమే తాగితే మంచిది. తియ్యగా ఉంటుంది
కదా అని ఎక్కువ చెరుకు రసం తాగితే అందులో షుగర్ వల్ల బరువు పెరిగే ప్రమాదం
కూడా ఉంటుంది.