ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
నాకు ప్రజలిచ్చిన అవకాశం..సీఎం జగన్ మనకున్న అదృష్టం
రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో ‘రాయల’పాలన
తొలిసారిగా డోన్ నియోజకవర్గంలో ప్రత్యక్ష్యంగా 10వేల ఎకరాలకు సాగునీరు
60 అడుగుల్లో భూగర్భజలాలు ఉండేలా , ఏడాది పొడవునా చెరువుల్లో పుష్కలంగా నీరు
త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం
అమరావతి : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 68 చెరువుల అభివృద్ధితో పుష్కలంగా
నీరందించే కార్యక్రమం చారిత్రాత్మకమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
వెల్లడించారు. ఒక్క డోన్ నియోజకవర్గంలో 30 చెరువులు, గుంటల అభివృద్ధితో 25
గ్రామాలకు సాగు నీరు అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. డోన్
నియోజకవర్గంలోని ప్యాపిలీ మండలంలో ఆర్థిక మంత్రి రెండో రోజూ పర్యటించారు.
డోన్ వ్యాప్తంగా వెంకటాపురం, మల్లెంపల్లె, జగదుర్తి, ఉడుములపాడు చెరువులను,
రెండో రోజు మెట్టుపల్లి సహా పలు గ్రామాలను సందర్శించి ట్రయల్ రన్ ను ఆర్థిక
శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యవేక్షించారు.వర్షాలతో ఆధారపడకుండా
గోరుకల్లు నుంచి శాశ్వత తాగునీరు, సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు
తెలిపారు.గత ప్రభుత్వాల హయాంలో నీటిపారుదల కింద ఎకరం కూడా నోచుకోని డోన్
నియోజక వర్గం త్వరలోనే చెరువుల నిండా నీటితో కళకళలాడనున్నాయన్నారు.
ప్రజలు తనకిచ్చిన అవకాశం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూపంలో దొరికిన అదృష్టం వల్లనే ఇదంతా సాధ్యమైందని
మంత్రి పేర్కొన్నారు.రూ.360 కోట్లతో హంద్రీ-నీవా ప్రధాన కాల్వ నుంచి జిల్లాలో
68 చెరువులకు నీరు మళ్లించే పనులు తుది దశకు చేరినట్లు వివరించారు. ఉమ్మడి
కర్నూలు జిల్లాలో కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చేపట్టిన హంద్రీనీవా నీటిని
చెరువులకు మళ్లింపు పథకం పూర్తయిందని త్వరలోనే దీన్ని సీఎం చేతులమీదుగా
ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రాథమిక దశలో డోన్ నియోజకవర్గం
లోని 8 చెరువుల ద్వారా నీటి మళ్ళించి రైతుల సాగునీటి కష్టాలు పరిష్కరించే
దిశగా అడుగులు వేస్తున్నారు. డోన్ లో ఏర్పాటు చేయనున్న పాఠశాల, కళాశాలలో
ఆడపిల్లలకు ప్రత్యేకంగావసతులకు పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. వైసీపీ
ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల్లో ఆలూరు, పత్తికొండ, డోన్, కర్నూలు ప్రాంతాల్లోని
ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన 68 చెరువుల అభివృద్ధికోసం కసరత్తు
చేస్తున్నట్లు చెప్పారు. గంటన్నర సమయం పట్టే పరిస్థితి నుంచి అరగంటలో గమ్యం
చేరేలా రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కృష్ఱగిరి మండల పరిధిలోని
పులిచెర్ల కొండపై ఏర్పాటు చేసిన డెలివరీ చాంబర్ నుంచి మూడు గ్రావిటీల ద్వారా
చెరువులకు నీరు మళ్లించే మెయిన్ పైప్ లైన్ పనులు త్వరలోనే పూర్తికానున్నట్లు
మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే నీటి మళ్లింపునకు చేపట్టిన ట్రయల్ రన్
విజయవంతమైందన్నారు. చనుగొండ్ల, వెంకటాపురం, యాపదిన్నె, అబ్బిరెడ్డిపల్లె,
మల్లెంపల్లె,జగదుర్తి, ఉడుములపాడు, దేవరబండ చెరువులను హంద్రీనీవా నీటితో నింపే
కార్యక్రమాన్ని త్వరలో సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి
బుగ్గన స్పష్టం చేశారు.