గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అరుదైన కానుక అందింది. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ది అందని అర్హులకు లబ్ది చేకూర్చే కార్యక్రమంలో సీఎం జగన్‌కి మంగళగిరికి చేనేత కార్మికుడు మురుగుడు నాగరాజు పట్టు వస్త్రాలు అందించారు. తాను స్వయంగా నేసిన చేనేత చీరను సీఎం జగన్ చేతికి అందించారు. ఈ కానుకను ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతికి అందించాలని నాగరాజు కోరారు. ఈ సందర్భంగా నాగరాజు నైపుణ్యాన్ని చూసి సీఎం జగన్ అభినందించారు.