బాలాయపల్లి- (వెంకటగిరి ఎక్స్ ప్రెస్) :-
చేప పిల్లలు పెంపకం చేయడంతో పంచాయితికీ ఆర్థికం ఉపయోగపడుతుందని గొట్టికాడు గ్రామ సర్పంచ్ వెందోటి సుప్రజ పేర్కొన్నారు.గురువారం మండలంలోని గొట్టికాడు గ్రామం చెరువు లో ప్రధానమంత్రి మత్స్య సంపదన యోజన పథకం ద్వారా 80 వేలు చేపపిల్లలను వదిలారు. ఈసంద ర్భంగా ఆమే మాట్లాడుతూ గ్రామంలోని చెరువులో రెండు రకాల బొచ్చా, గెండి చేప పిల్లల వదలడం జరిగిందన్నారు. ప్రభుత్వం గిరిజనులను ఆదుకు నేందుకు సొసైటీల ద్వారా చేపలు వదలడం జరిగిందన్నారం.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గిరిజనుల కుటుంబాల సంరక్షణ కోసం వారికి ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడం హర్షించ దగ్గ విషయమన్నారు.ఈ పధకం వల్ల పేద గిరిజ నులకు లబ్ధి చేకూరుటమే కాకుండా స్థానిక ప్రజల్లో పౌష్ఠికాహార లోపాన్ని అధిగ మించే వీలుందన్నారు చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యకర సమాజం ఏర్పడు తుందన్నారు.ఈ కార్యక్రమంలో వీఆర్ ఓ శ్రీనివా సులు,సొసైటీ సభ్యులు అద్దూరు చెంచయ్య, కరణం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
పోటో:- చెప పిల్లలు వదులుతున్న గ్రామ సర్పంచి