టీడీపీ నేతల కాలక్షేప రాజకీయం
జిల్లాకు ఒక్క శాశ్వత పనీ చేయని టీడీపీ
నాటి వైఎస్ఆర్, నేటి జగన్ పాలనలోనే అభివృద్ధి
నరసన్నపేట నియోజకవర్గంలో ఒక్క రోడ్ల అభివృద్ధి పనులకే రూ.100 కోట్లు ఖర్చు
నరసన్నపేట : శ్రీకాకుళం జిల్లా పుట్టింది మొదలు గత 2019 వరకూ ఎన్నో సార్లు
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు 14 ఏళ్లు సీఎం గా ఉన్నా ఈ
జిల్లా ప్రగతికి చేసిన శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమం ఒక్కటీ లేదన్నది బహిరంగ
రహస్యం. 2004 నుంచి 2009 వరకూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ,
ప్రస్తుతం 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో, సీఎం వైఎస్ జగన్
ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని తనదిగా చూపించుకోవడం కోసం టీడీపీ నేతలు
ఈమధ్య కొత్త వ్యూహాలతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో భాగమే
సెల్ఫీఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేయడం. అయితే వాస్తవంగా ఎవరి
హయాంలో ఎంత మేరకు అభివృద్ధి జరిగింది? సంక్షేమం ఎవరి వల్ల చేరుతోందో.. స్థానిక
ప్రజలు మాత్రం సక్రమంగానే గ్రహిస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో పదేపదే
అబద్దాలు ప్రచారం చేసుకుంటే అవే నిజాలుగా జనం నమ్మేస్తారనే పనికిమాలిన
స్ట్రాటజీని కొంతమంది టీడీపీ నాయకులు నమ్ముకుని తెగ ఆవేశపడిపోతుండడం గమనార్హం.
జిల్లాలో శాశ్వతమైన అభివృద్ధి పనులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది వైయస్
కుటుంబమే. ఒక వంశధార ప్రాజెక్టు, రిమ్స్ ఏర్పాటు, అంబేద్కర్ విశ్వవిద్యాలయం,
నేటి ట్రిపుల్ ఐటీ భవనం ఇలా లెక్కకు మిక్కిలి ఎన్నో డాక్టర్ వైఎస్
రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగినవనే విషయం ఎవరూ కాదనలేని నిజం.
తండ్రికి ఏమాత్రం తీసిపోని తనియనిగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా
ఎన్నో అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం
చూపకుండా ఉపశమన చర్యలకే పరిమితం అయితే, సీఎం జగన్ మాత్రం పలాసలో కిడ్నీ
రిసెర్చ్ సెంటర్, రూ.700 కోట్లతో శాశ్వత మంచినీటి పథకం వంటివాటి పనులు దాదాపు
పూర్తి చేశారు. జూన్‌లో వాటిని ప్రారంభిస్తామని సగర్వంగా ప్రకటించారు కూడా.
ఇటీవలే మూలపేట పోర్టుకు శంకుస్థావన, వంశధార ఎత్తిపోతల పథకం, బుదగట్ల పాలెం
వద్ద ఫిషింగ్ హార్బర్‌కు శంకుస్థాపన వంటి బృహత్తర అభివృద్ధి పనులకు శ్రీకారం
చుట్టారు. వీటిని రానున్న రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్న టీడీపీ నేతలు తమ హయాంలో కేవలం శంకుస్థాపనలు
మాత్రమే చేసి, నిధులు విడుదలచేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన వాటిని ప్రస్తుత
ప్రభుత్వం వైఫల్యాలుగా చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ లంటూ చంకలు గుద్దుకుంటుండడం
హాస్యాస్పదంగా మారింది.
తాజాగా నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పోలాకి మండలం వనిత మండలం
నందు టీడీపీ ప్రభుత్వం బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.72 కోట్ల మంజూరు చేసి 50%
పనులు పూర్తి చేసేసిందని, వైస్సార్సీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు గడిచినా
బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చెయ్యలేదంటూ ఒక సెల్ఫీ పోస్టు చేశారు. దీనిలో నిజం
ఏమిటంటే ఈ వంతెన పనులకు టీడీపీ హయాంలోనే శంకుస్థాపన జరిగినా నిధులు తగినంతగా
విడుదల చేయలేదు, అంతేకాకుండా సమర్ధత లేని కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడంతో
వారి హయాంలోనే అవి వడకేశాయి. ఆ తర్వాత వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం వచ్చాక డిప్యూటీ
సీఎం ధర్మాన కృష్ణదాన్ చొరవతో దీనికి నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం
పనులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ పసలేని సెల్ఫీ చాలెంజ్‌లతో దిగజారుడు
రాజకీయాలకు దిగితే వాస్తవంగా తామేం చేసామో చూడండి అంటూ ప్రతిగా వైఎస్ఆర్సిపి
నేతలు సెల్ఫీలతో నరసన్నపేట నియోజక వర్గంలో సోషల్ మీడియాలో హోరెత్తించారు.
దాదాపు రూ.50 కోట్లతో పూర్తిచేసిన కొమనాపల్లి వంతెన, రూ.25 కోట్లతో పూర్తి
చేసిన జాతీయ రహదారి నుంచి బుడితి జంక్షన్ బద్రి రహదారి, నరసన్నపేట టౌన్ రహదారి
విస్తరణ, సెంట్రల్ లైటింగ్ రూ.4.5 కోట్లు, రూ.10 కోట్లతో పూర్తి చేసిన లుకలం,
కోమనాపల్లి విస్తరణ, రూ. 36 కోట్లతో పూర్తి చేసిన జర్గంగ్గి నుంచి
శ్రీముఖలింగం రహదారి ఇలా చెప్పుకుంటే మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు రహదారుల
భవనాల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణ దాస్ ఉన్నప్పుడు జరిగినవే! ఈ సందర్భంలో
టిడిపి నేతల సెల్ఫీలు కారణంగా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన
అభివృద్ధి పనులతో ప్రజలు వాస్తవాలు గ్రహించగలిగినట్లు అయింది. టిడిపి నేతల
సైతం తోక ముడచక తప్పలేదు. ఇవి కాకుండా ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం రైతు
భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడు పాఠశాల పనులు,
అంగన్వాడి భవనాల నిర్మాణాలతో నిరాటంకంగా అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి.