బీజింగ్ : చైనాలో కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7
విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల లాక్ డౌన్లు ఎత్తివేయడంతో అత్యధిక స్థాయిలో
ఇన్ఫెక్షన్ రేటు నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు. దానికితోడు, చైనా
వ్యాక్సిన్ల పనితీరుపై సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, చైనాలో కరోనా మరణాలు
తీవ్ర ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన వారం రోజుల్లో చైనాలో 13 మంది
కరోనాతో మృత్యువాత పడినట్టు వెల్లడైంది. లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం జనవరి 12
వరకు 60 వేల మంది చనిపోగా, ఈ వారం రోజుల్లో భారీస్థాయిలో కరోనా బాధితులు
మరణించడం చైనా అధికార వర్గాలను కలవరపరుస్తోంది. చైనా అధికారులు చెబుతున్న
కరోనా మరణాలు ఆసుపత్రుల్లో నమోదైనవే. ఇళ్లలో చనిపోయిన వారిని కూడా లెక్కిస్తే
ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. చైనా నూతన సంవత్సర వేడుకల కోసం
చాలామంది సొంత ఊర్లకు వెళ్లారని, దాంతో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపించే అవకాశం
ఉందని భావిస్తున్నారు. అటు, చైనా నూతన సంవత్సర వేడుకల అనంతరం రోజువారీ మరణాల
సంఖ్య 36 వేలకు చేరుకునే అవకాశం ఉందని ఎయిర్ ఫినిటీ అనే సంస్థ అంచనాలు
వెల్లడించింది.