న్యూఢిల్లీ : 2022 మొదటి మూడు త్రైమాసికాలలో చైనా నుంచి భారతదేశం దిగుమతులు ఇప్పటికే 89 బిలియన్ డాలర్లను (రూ. 7.19 లక్షల కోట్లకుపైగా) అధిగమించాయి. ఈ ఏడాది చివరి నాటికి వంద బిలియన్ డాలర్లను (రూ. 8.09 లక్షల కోట్లకుపైగా) దాటేందుకుసిద్ధంగా కనిపిస్తునుది. ఇందులో ప్రధానంగా మూలధనం, పారిశ్రామిక వస్తువులు ఉనాుయి. రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వస్తువులను బహిష్కరించాలనిభారత్లో కొనిు వర్గాల నుంచి పిలుపులు వచ్చాయి. అయినప్పటికీ.. ఈ పెరుగుదల నమోదు కావటం గమనార్హం.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. 2021 సెప్టెంబరులో భారత్ చైనా నుంచి 62 బిలియన్ డాలర్ల (రూ. 5 లక్షల కోట్లకుపైగా) విలువైన వస్తువులను దిగుమతి చేసుకునుది. అయితే, కేవలం ఒక ఏడాదిలోనే ఈ సంఖ్య 44 శాతం పెరగటం గమనార్హం. భారత మొత్తం దిగుమతుల వృద్ధి కంటే చైనా వస్తువుల దిగుమతుల వృద్ధి గణనీయంగా ఎక్కువగా ఉనుది. ఈ ఏడాది జనవరిాసెప్టెంబరు మధ్య భారత మొత్తం దిగుమతి 551.8 బిలియన్ డాలర్లుగా (రూ. 44.50 లక్షల కోట్లకుపైగా) ఉనుది. ఇది గతేడాది దిగుమతి బిల్లు 406 బిలియన్ల డాలర్లతో (రూ. 32.79 లక్షల కోట్లకుపైగా) పోల్చుకుంటే 35 శాతం అధికం కావటం గమనార్హం.
చైనా నుంచి దిగుమతులు వేగంగా పెరగటం అంటే భారత మొత్తం దిగుమతుల్లో దానివాటా 2021 (జనవరి-సెప్టెంబరులో) 15.3 శాతం నుంచి 2022లో (జనవరి-సెప్టెంబరు) 16.2 శాతానికి పెరిగింది. యునైటెడ్ నేషన్స్ కామ్ట్రేడ్ సమాచారం ప్రకారం.. మూలధనం లేదాపారిశ్రామిక వస్తువుల దిగుమతుల కారణంగా చైనా నుంచి భారత్కుదిగుమతులు ఎక్కువగా పెరుగుతునాుయి. గత 10 ఏండ్లలో (2011 నుంచి 2021 వరకు) చైనా నుంచి భారత మూలధన వస్తువుల దిగుమతులు ప్రతి ఏడాదీ సగటున నాలుగు శాతం పెరగటం విశేషం.