నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులతో మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు
ఎమ్మెల్యే , ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని సమీక్షా సమావేశం
ఏలూరు : రాష్ట్రంలోని బీసీల సంక్షేమం కోసం అండగా నిలుస్తూ వారి అభివృద్ధి కోసం
ఎంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా
పాల్గొంటున్న జయహో బీసీ మహాసభకు ఏలూరు జిల్లా నుంచి బిసిలు భారీ సంఖ్యలో
పాల్గొని జగనన్న కు తమ మద్దతు తెలుపనున్నారని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి,
ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని తెలిపారు.
ఈ నెల7వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా జరగనున్న జయహో బీసీ మహాసభకు ఏలూరు జిల్లా
నుంచి బీసీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రానున్న నేపథ్యంలో సోమవారం ఏలూరు
క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు
జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని ఏలూరు నియోజక వర్గంలో ని పలువురు
ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. బిసిల పక్షపాతి
జగనన్నకు తమ మద్దతు తెలుపటానికి భారీగా బీసీ సామాజిక వర్గాల ప్రజలు తరలి
వస్తున్న నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆళ్ల నాని
సూచించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఆళ్ల నాని పలు
సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్లు గుడిదేశీ శ్రీనివాస్,
నూకపెయ్యి సుదీర్ బాబు, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, నగర
అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, వైయస్సార్ సిపి సీనియర్ నాయకులు బలరాం,
కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ చైర్మన్ కురేళ్ళ రామ్ ప్రసాద్,
కార్పొరేటర్ జయకర్, బీసీ సెల్ అధ్యక్షులు పొడిపిరెడ్డి నాగేశ్వరరావు,
వైఎస్సార్ సిపి నాయకులు కిలాడి దుర్గారావు, కొల్లిపాక సురేష్ తదితరులు
పాల్గొన్నారు.