10 రోజులపాటు పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల
ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ
1 నుండి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లో బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమాన్ని
ప్రారంభించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
కురుపాం : పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా 15,000 ఆర్థిక సాయం..1
నుండి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు.
నేడు అందిస్తున్న రూ.6,392.94 కోట్లతో కలిపి ఇప్పటివరకు కేవలం “జగనన్న
అమ్మఒడి” అనే ఈ పథకం క్రింద మాత్రమే జగనన్న ప్రభుత్వం అందించిన లబ్ధి రూ.
26,067.28 కోట్లు.
పేదరికమే అర్హతగా కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గాలకు అతీతంగా ప్రభుత్వ,
ఎయిడెడ్, ప్రైవేట్ ఏ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకైనా పారదర్శకంగా,
లంచాలకు వివక్షకు తావులేకుండా నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో లబ్ధి
చేకూరనుంది.
అదే రాష్ట్ర బడ్జెట్, అదే అధికార యంత్రాంగం. మారిందల్లా పాలకుడే. నాయకుడు
చిత్తశుద్ధి కలవాడైతే పాలన ఎంత మెరుగ్గా ఉంటుందో నిరూపిస్తూ ఒక్క విద్యా
రంగంలో కేవలం ఆ విద్యా సంస్కరణలపై -మాత్రమే జగనన్న ప్రభుత్వం అధికారంలోకి
వచ్చిన ‘ ఈ నాలుగేళ్లలో చేసిన వ్యయం అక్షరాలా రూ. 66,722.36 కోట్లు.
పాఠశాలల్లో డ్రాపౌట్స్ సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే మంచి ఉద్దేశ్యంతో అమ్మ
ఒడి పథకానికి కనీసం అటెండెన్స్ ఉండేలా నిబంధన.. పిల్లలను క్రమం తప్పకుండా
పాఠశాలలకు పంపి, కనీసం 75% హాజరు ఉండేలా తల్లులు బాధ్యత తీసుకోవాలి. అప్పుడే
విద్యారంగంలో మన ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాల లక్ష్యం
నెరవేరుతుంది.
2018లో ప్రాథమిక విద్యా స్థాయిలో జీఈఆర్ జాతీయ సగటు 99.21 శాతంగా ఉంటే
ఆంధ్రప్రదేశ్ లో ఇది 84.48 శాతానికి పరిమితమైన దుస్థితి. అప్పుడు దేశంలోని 29
రాష్ట్రాలలో అట్టడుగు స్థానం మనది. అయితే నాలుగేళ్లలో జగనన్న ప్రభుత్వం
విద్యారంగంలో తెచ్చిన సంస్కరణ వల్ల 84.48 శాతంగా ఉన్న జీఈఆర్ 100.8 శాతానికి
చేరింది. జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు 10-12వ తరగతిలో ఉత్తీర్ణత
సాధించని వారు తిరిగి క్లాసులకు అటెండ్ అయ్యే అవకాశం కల్పిస్తూ వారికి ” సైతం
అమ్మఒడి అందించేందుకు నిర్ణయం.
మన బడి “నాడు-నేడు” ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలు చిరకాలం విద్యార్థులకు
అందాలన్న తపనతో ఏవైనా చిన్న రిపేర్లు సమయానికి వెంటనే పట్టించుకోకపోతే మరింత
పెద్దవై కల్పించిన మంచి సౌకర్యాలు పనికిరాకుండా పోతాయని, ఆ పరిస్థితి రాకుండా
అప్పటికప్పుడే సరిచేయాలనే సదుద్దేశ్యంతో అమ్మ ఒడి నిధుల నుండి* నాడు – నేడులో
అభివృద్ధి చెందిన ఆ తల్లుల పిల్లలు వెళ్లే స్కూళ్ళ బాగుకోసం “స్కూలు
మెయింటెనెన్స్ ఫండ్” (SMF) కు రూ.1,000 లు జమ చేస్తున్నారు. స్కూళ్ళలో మంచి
టాయిలెట్స్ లేక ఆడపిల్లలు బడులు మానేసే దుస్థితి మారుస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో
పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ “నాడు – నేడు” ద్వారా నిర్మించిన బాలికల
ప్రత్యేక టాయిలెట్లు, ఇతర టాయిలెట్ల మెయింటెనెన్స్ కొరకు డ్రాపౌట్సును
తగ్గించడంతో పాటు విద్యార్థినీ, విద్యార్థుల ఆత్మ గౌరవం నిలబెట్టాలనే మంచి
ఉద్దేశ్యంతో అమ్మఒడి పథకం నిధుల నుండి మన పిల్లలు చదివే మన బడుల “టాయిలెట్
మెయింటెనెన్స్ ఫండ్” కు రూ. 1,000 లు జమ చేస్తున్నారు.
ఈ టాయిలెట్లు ఎప్పుడూ ఇదేవిధంగా మెయింటెన్ అయ్యేలా ఉండాలన్న తపనతో నిర్వహణలో
ఏవైనా లోపాలుంటే, హక్కుగా అడిగే పరిస్థితులను తల్లులకు కల్పిస్తూ, ప్రభుత్వ
పాఠశాలల్లో జవాబుదారీతనం పెరిగేలా “పాఠశాల మెయింటెనెన్స్ ఫండ్”, “టాయిలెట్
మెయింటెనెన్స్ ఫండ్”ల నిర్వహణ _ బాధ్యత కూడా హెడ్మాస్టర్లు, పేరెంట్స్
కమిటీలకే అప్పగించారు.
“జగనన్న అమ్మఒడి” లబ్ధి అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులుంటే జగనన్నకు చెబుదాం 1902
టోల్ ఫ్రీ నంబర్. దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు
అమలు చేస్తున్న జగనన్న ప్రభుత్వం.
దేశంలో ఎక్కడా లేని విధంగా, దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో జగనన్న
ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలు..
కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీపడేలా మన విద్యార్థులను గ్లోబల్
సిటిజన్లుగా తీర్చిదిద్దేలా డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ
బైజూస్ కంటెంట్ తో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్, స్మార్ట్ టీవీలు. డిజిటల్
విధానంలో బోధన దిశగా నాడు నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన చేస్తున్న
పాఠశాలల్లో 6వ తరగతి ఆపైన ప్రతి తరగతికి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్ లైన్లో కూడా
పని చేసేలా, బైజూస్ కంటెంట్ తో కూడిన 62,000 పై చిలుకు ఇంటరాక్టివ్ ప్లాట్
ప్యానల్స్ తో డిజిటల్ క్లాస్ రూమ్స్.. ఇంగ్లీషు ల్యాబ్ లు నిర్మిస్తూ, 1-5
తరగతులకు ప్రతి స్కూల్లో ఉండేలా 3 దశల్లో దాదాపు 45 వేల స్మార్ట్ టీవీలు కూడా
ఏర్పాటు దిశగా అడుగులు..
ఇంగ్లీషు మీడియం విద్య సీబీయస్ఈ తో అనుసంధానం
పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ
స్థాయిలో రాణించేందుకు, వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు వీలుగా
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియంలో విద్యా
బోధన.
సీబీఎస్ఈ తో సిలబస్ అనుసంధానం
ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏర్పాటు. బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ (ఒక పేజీలో తెలుగు,
మరో పేజీలో ఇంగ్లీష్. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు – తెలుగు డిక్షనరీ.. ఉచిత ట్యాబ్లు,
బైజూస్ కంటెంట్ తో
పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, డిజిటల్
విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా ఆఫ్ లైన్లో కూడా పని చేసేలా బైజూస్
కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్ ల పంపిణీ. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా
అర్థమయ్యేలా, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతిలో అడుగు పెట్టిన ప్రతి
విద్యార్థికి ఆన్లైన్లోనే కాకుండా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 4, 59, 564
మంది విద్యార్థులు, 59.176 మంది ఉపాధ్యాయులకు రూ. 685.87 కోట్ల ఖర్చుతో
5,18,740 ట్యాబ్ ల పంపిణీ.. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న. 4 నుంచి 10వ తరగతి
వరకు ఉచితంగా బైజూస్ కంటెంట్.. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్
విద్యార్థులకు కూడా బైజూస్ కంటెంట్. బీఎస్ఎన్ఎల్, ఏపీ ఫైబర్ నెట్ ద్వారా
45,000 పాఠశాలల్లో ఇంటర్ నెట్ అందించేందుకు చర్యలు..
టోఫెల్ సర్టిఫికెట్లు..
ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా
ఈ ఏడాది నుండే ప్రతి స్కూల్లో దీన్ని ప్రవేశపెడుతూ తర్పీదు ఇస్తూ టోఫెల్
ప్రైమరీ, టోఫెల్ జూనియర్, ఇంటర్ లో టోఫెల్ సీనియర్ పరీక్షలు కూడా నిర్వహించి ఆ
అమెరికన్ సర్టిఫికెట్ అందజేత. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇచ్చేలా అమెరికన్
సంస్థ ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్) తో ఒప్పందం..
3వ తరగతి నుండి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ …
గతంలో 1 నుండి 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులు ఒకే టీచర్ బోధించే దుస్థితి.. 1
నుండి 5 తరగతుల వరకు చదివే అందరు పిల్లలని ఒకే దగ్గర కూర్చోబెట్టి పాఠాలు
చెప్పే పరిస్థితి.. నేడు ఆ పరిస్థితిని సమూలంగా మారుస్తూ పిల్లల శారీరక,
మానసిక వికాసం కోసం 3వ తరగతి నుండే ప్రతి సబ్జెక్టును ప్రత్యేక టీచర్ బోధించే
విధంగా ఏర్పాటు. ఇది కేవలం విద్యా రంగంలో సంస్కరణలపై మాత్రమే జగనన్న ప్రభుత్వం
ఈ 4 ఏళ్లలో చేసిన వ్యయం
జగనన్న అమ్మ ఒడి – లబ్ధిదారుల సంఖ్య – 44,48,865, అందించిన మొత్తం రూ. కోట్లలో
26,067.28
జగనన్న విద్యా కానుక – లబ్ధిదారుల సంఖ్య – 43,10,165 అందించిన మొత్తం రూ.
కోట్లలో 3,366.53
జగనన్న గోరుముద్ద – లబ్ధిదారుల సంఖ్య – 43,26,782 అందించిన మొత్తం రూ. కోట్లలో
3,590.00
పాఠశాలల్లో నాడు నేడు మొదటి దశ – స్కూల్స్ సంఖ్య – 15,715 అందించిన మొత్తం రూ.
కోట్లలో 3,669.00
పాఠశాలల్లో నాడు నేడు రెండో దశ – స్కూల్స్ సంఖ్య – 22,344 అందించిన మొత్తం రూ.
కోట్లలో 8,000.00
వైఎస్సార్ సంపూర్ణ పోషణ – లబ్ధిదారుల సంఖ్య – 35,70,675 అందించిన మొత్తం రూ.
కోట్లలో 6,141.34
స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ – లబ్ధిదారుల సంఖ్య – 10,01,860 అందించిన మొత్తం
రూ. కోట్లలో 32.00
డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ ట్యాబ్లు – లబ్ధిదారుల సంఖ్య – 5,18,740
అందించిన మొత్తం రూ. కోట్లలో 685.87
జగనన్న విద్యా దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 26,98,728 అందించిన మొత్తం రూ.
కోట్లలో 10,636.67
జగనన్న వసతి దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 25,17,245 అందించిన మొత్తం రూ.
కోట్లలో 4,275.76
జగనన్న విదేశీ విద్యా దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 1,858 అందించిన మొత్తం రూ.
కోట్లలో 132.41
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా – లబ్ధిదారుల సంఖ్య – 16,668
అందించిన మొత్తం రూ. కోట్లలో 125.50
మొత్తం రూ. 66,722.36 కోట్లు
గత ప్రభుత్వ 5 ఏళ్ళలో విద్యారంగ దుస్ధితి
జగనన్న అమ్మ ఒడి లేదు
స్కూల్స్ తెరిచిన 6-7 నెలలకు కూడా యూనిఫాం. సంగతి దేవుడెరుగు కనీసం టెక్స్ట్
బుక్స్ కూడా అందించలేని దుస్థితి. అందించినవి కూడా అరకొరగా కొద్ది మందికే..
ఇతర వస్తువుల ఊసే లేదు..
నాసిరకం ఆహారం, అరకొర కేటాయింపులు, ఆయాల జీతాలు, సరకుల బిల్లులు సైతం 8-9
నెలలు పెండింగ్ లోనే.. ఖర్చు చేసింది ఏటా సగటున కేవలం రూ. 450 కోట్లు
మాత్రమే.. రాగి జావ, చిక్కీ ఊసే లేదు..
శిథిలావస్థలో బడులు.. సౌకర్యాల లేమి..
నామమాత్రంగా పాష్టికాహారం.. అదీ కొందరికే పరిమితం.. ఏటా సగటున ఖర్చు చేసింది.
కేవలం రూ. 500 కోట్లు మాత్రమే…
ఇచ్చినవే అరకొర ఫీజులు -అవీ ఏళ్ళ తరబడి పెండింగులు.. గత ప్రభుత్వం పెట్టిన
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.1,778 కోట్లు కూడా జగనన్న ప్రభుత్వమే
చెల్లించింది.. ఫీజు రీయింబర్స్మెంట్ దుస్థితి ఇదయితే ఇక దీవెన సంగతి
దేవుడికెరుక..
విదేశీ విద్యా దీవెన విషయంలో కాలేజీల ఎంపికలో కొరవడిన ప్రమాణాలు.. ఫీజుల
చెల్లింపులో పెద్ద ఎత్తున బకాయిలు. 2016-17 నుండి పథకాన్ని రద్దు చేసి రూ.318
కోట్ల ఫీజు బకాయిలు.