గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా 39 వ డివిజన్ లోని పలు ప్రాంతాలలో పర్యటన
కడప : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో ఎస్సి,
ఎస్టీ, బిసి, మైనారిటీలకు పెద్ద పీట వేసి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు
అందించడం జరుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ అన్నారు. నగరంలోని
39 వ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ షేక్. షాబాన, డివిజన్ ఇంచార్జ్ షేక్.
కమాల్ బాషా ఆధ్వర్యంలో అక్కాయపల్లి సచివాలయం- 2 పరిధిలోని మోచంపేట,మాసీమ బాబు
వీధి, చిలకలబావి వీధులలో ని పలు ప్రాంతాలలో పర్యటించారు. 68 వ రోజు న “గడప
గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్
బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి స్థానిక కార్పొరేటర్,
నాయకులు, అధికారులతో కలిసి ఆయా వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు. రాష్ట్ర
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రభుత్వ
పథకాల లబ్దిదారులతో నేరుగా మాట్లాడారు. పథకాల లబ్ధి సమాచారంతో కూడిన రాష్ట్ర
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్‌ను అందజేశారు.
కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నవారు ప్రభుత్వ పాలనపై
సంతృప్తి వ్యక్తం చేయగా పలువురు తమ సమస్యలను అంజాద్ బాషా దృష్టికి
తీసుకురాగా.. వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు రెఫర్ చేశారు. రాష్ట్ర
ప్రజల సంక్షమం, అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద
ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు చేరుతున్నాయని, ఉప
ముఖ్యమంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు
సంతృప్త స్థాయిలో అందడం.. జగన్ మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం
పడుతోందన్నారు. కార్యక్రమంలో ప్రతి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు
చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై లబ్దిదారుల మనోభావాలను
తెలుసుకుంటూ ముందుకు సాగారు. జోసాయి సునీత అనే మహిళ తనకు వైఎస్ ఆర్ రైతు
భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఈబిసి నేస్తం, వైఎస్ఆర్
పింఛన్ కానుక, జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా రూ.10
లక్షల, 49 వేల, 651 లు లబ్ధి చేకూరిందని ఆనందం వ్యక్తం చేసింది. ఇన్ని
సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం లో మాకు అందలేదని ఇలాంటి ముఖ్యమంత్రి కి
ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. షేక్. శంషాద్ అనే మహిళ తనకు జగనన్న వసతి
దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్ ఆర్ పింఛన్ కానుక, వైఎస్ ఆర్ చేయూత,
జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా రూ.10 లక్షల 41 వేల 393
లు లబ్ధి చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేసి మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నామని,
మా చల్లని దీవెనలతో ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు
తెలిపారు. ఎస్. నగిన అనే మహిళ తనకు వైఎస్ ఆర్ చేయూత, వైఎస్ ఆర్ పింఛన్
కానుక, జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా రూ. 9 లక్షల,
36వేల 250లు మా కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరిందని ఈ ప్రభుత్వానికి
ఎల్లప్పుడూ బాసటగా ఉంటామని ఆనందం వ్యక్తం చేసింది. షేక్. గుల్జార్ అనే మహిళ
తనకు వైఎస్ ఆర్ చేయూత, జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా
రూ.9 లక్షల, 06 వేల 250 లు లబ్ది చేకూరిందని ఈ ప్రభుత్వానికి బాసటగా ఉంటామని
ఆనందం వ్యక్తం చేశారు. షేక్. మస్థాని అనే మహిళ తన కుటుంబానికి వైఎస్ ఆర్
పింఛన్ కానుక జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా రూ. 9
లక్షల, 32 వేలు లబ్ది చేకూరిందని ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వం సహయం
అందించలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కి కలకాలం రుణ పడి ఉంటామని ఆనందం వ్యక్తం
చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రితో పాటు నగర 39 వ డివిజన్ కార్పొరేటర్
షేక్. షాబాన, డివిజన్ ఇంచార్జ్ షేక్. కమాల్ బాషా, వైకాపా నాయకులు మాసీమ
బాబు, నారపురెడ్డి సుబ్బారెడ్డి, షేక్ మహమ్మద్ షఫీ, ఎన్ఆర్ఐ తోట కృష్ణ,
పసుపులేటి మనోహర్, దాసరి శివ, మార్కేట్ యార్డు డైరెక్టర్ బంగారు నాగయ్య,
నాయకురాళ్లు టి.వి. సుబ్బమ్మ, వివిధ కార్పొరేషన్ ల ఛైర్మన్ లు, డైరెక్టర్లు,
ఇతర నగర కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు,
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.