గుంటూరు : పేదవాడి ప్రతిభకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, జగనన్న విదేశీ
విద్యా దీవెన పధకం ద్వారా విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం
ప్రభుత్వం కల్పించిందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమం, అభివృద్ధి
కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు అన్నారు. తాడేపల్లి లోని కాపు కార్పొరేషన్
రాష్ట్ర కార్యాలయంలో శనివారం పాత్రికేయుల సమావేశంలో అడపా శేషు మాట్లాడుతూ పేద
విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాధమిక
పాఠశాలల నుండి ఉన్నత విద్యాలయాల వరకూ పలు సంస్కరణలు తీసుకువచ్చిందని శేషు
అన్నారు. జగనన్న విదేశీ విద్యా పధకం క్రింద టాప్ 200 యూనివర్సిటీలలో పేద
విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించామని మొదటి విడతగా టాప్
200 విదేశీ యూనివర్సిటీలలో 213 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారని వారిలో 45
మంది కాపు విద్యార్థులు ఉన్నారన్నారు.
విద్యార్థులకయ్యే ఖర్చుకు ప్రభుత్వం భరిస్తుందని అయన అన్నారు. పేరెన్నిక గన్న
1 నుండి 100 యూనివర్సిటీలలో సీటు వచ్చిన విద్యార్థులకు 100 శాతం ఫీజును
ప్రభుత్వమే భరిస్తుందని 101 నుండి 200 వరకూ యూనివర్సిటీలలో సీట్ వచ్చిన వారికీ
50 శాతం ఫీజులను ప్రభుత్వం భరిస్తుందని అయన అన్నారు. ఉన్నతమైన
విశ్వవిద్యాలయాల్లో పేద విద్యార్థులను అత్యున్నత విద్యా వంతులుగా తీర్చి
దిద్దే విషయంలో ముఖ్యమంత్రి ఎంతో ప్రోత్సహిస్తున్నారన్నారు. పేదవారికి
మెరుగైన జీవన విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పధకాలు అమలు
చేస్తున్నదో ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు.
గత ప్రభుత్వంలో ఈ పధకానికి సంబంధించి పలు అవకతవకలు జరిగాయని విజిలెన్స్
విచారణలో గత ప్రభుత్వంలో ఈ పధకం క్రింద విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న
174 మంది విద్యార్థులకు సంబంధించి విజిలెన్స్ శాఖ ఇచ్చిన వివరాలను ప్రభుత్వం
పరిశీలించిందన్నారు. విదేశీ విద్యా పధకంలో తలసరి ఆదాయం రూ. 6 లక్షలు ఉండాలనే
నిబంధనలను అతిక్రమించి గత ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని విజిలెన్సు
అండ్ ఎన్ఫోర్స్ మెంట్ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం,
పశ్చిమ గోదావరి, కర్నూల్, అనంతపురం, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో 174 మందిని
అర్హులుగా గుర్తించారని వీరందరికీ కూడా ఈ ప్రభుత్వం ఈ పధకం క్రింద ఫీజు రీ
ఎంబర్స్ మెంట్ అందిస్తుందని అడపా శేషు అన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెనె
చరిత్రలో నిలిచిపోతుందని అయన అన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్, జ్యోతీరావు
పూలే మొదలగు మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పేద వర్గాల వారికి అనేక సంక్షేమ
అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. రాష్ట్రంలో
ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి
చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. పేద ప్రజల తరపున ఎవరైతే పోరాడుతారో
వారే నిజమైన నాయకుడని, అటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు.