నేడు జగనన్న ప్రతి ఒక్కరికీ పథకాలు ఇస్తున్నాం
11 రకాల ధృవీకరణ పత్రాలు జగనన్న సురక్ష కార్యక్రమంలో ఉచితంగా ఇస్తున్నాం
గోదావరి జిల్లాలో వైసిపి పార్టీ గెలిస్తే పవన్ కళ్యాణ్ పార్టీ మూసేసుకొని
వెళ్తావా
నా సవాల్ నీ స్వీకరించే దమ్ము పవన్ కళ్యాణ్ కి ఉందా
పవన్ కళ్యాణ్ పగటి కలలు మానుకోవాలి
ప్రజలకు మంచి చేసే జగనన్న పై దుమారం లేపితే సహించేది లేదు
విజయవాడ : పశ్చిమ నియోజకవర్గంలోని జగనన్న సురక్ష కార్యక్రమాన్ని స్థానిక
34,35 డివిజన్ల లో శనివారం మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అర్హులకు సంబంధిత
ధృవీకరణ పత్రాలను అందించారు.
ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు ఇక్కడే వుంది ధృవీకరణ
పత్రం అందిస్తారన్నారు. 34వ డివిజన్ లో 700 ధృవీకరణ పత్రాలు ఇస్తున్నట్లు
తెలిపారు. అక్కడిక్కడే ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు కృషి చేయడం జరిగిందన్నారు.
గతంలో ఏళ్ల తరబడి తిరగాల్సి వచ్చేదన్నారు. చంద్రబాబు గతంలో అందరికీ కాదు
కొందరికే పథకాలు ఇచ్చేవాడన్నారు. నేడు జగనన్న ప్రతి ఒక్కరికీ పథకాలు
ఇస్తున్నామాన్నారు. 11 రకాల ధృవీకరణ పత్రాలు ఇస్తున్నామన్నారు.ప్రజల కి మంచి
చేసేందుకే కృషి చేస్తున్నామన్నారు.
అదేవిధంగా పవన్ కళ్యాణ్ పై ఘాటుగా విమర్శలు చేశారు.గోదావరి జిల్లాలో వైసిపి
పార్టీ గెలిస్తే పవన్ కళ్యాణ్ పార్టీ మూసేసుకొని వెళ్తావా అని ప్రశ్నించారు.నా
సవాల్ నీ స్వీకరించే దమ్ము పవన్ కళ్యాణ్ నీకు వుందా అని సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే కాదు కదా అసెంబ్లీ గేటు కూడా దాటే అర్హత పవన్ కళ్యాణ్ కి లేదన్నారు.
పవన్ కళ్యాణ్ పగటి కలలు మానుకోవాలని హితువు పలికారు. పవన్ కళ్యాణ్ నువ్వు ఒక
చిరంజీవి తమ్ముడుగా ఒక గుర్తింపు తెచ్చుకుని బతుకు ఇదే నా హెచ్చరికన్నారు.
ప్రజలకు మంచి చేసే జగనన్న పై దుమారం లేపితే
సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,స్థానిక
కార్పొరేటర్లు బండి పుణ్యశిల, బలసాని మనెమ్మా,డివిజన్ నాయకులు కార్యకర్తలు,
సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు నగర పాలక సంస్థ, రెవిన్యూ అధికారులు,
సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు