విజయవాడ పశ్చిమ : స్థానిక పశ్చిమ నియోజకవర్గంలోని 39,40 డివిజన్ లలో బుధవారం నాడు జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులకు సంబంధిత ధృవీకరణ పత్రాలను అందించారు. ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు ఈ క్యాంప్ వద్ద వుండి ప్రజల వద్ద నుండి వచ్చిన అర్జీలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 11రకాల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.వారం రోజుల పాటు డివిజన్ లో ప్రతి ఇంటికి వాలంటరీ వ్యవస్థ సచివాలయం సిబ్బంది , పార్టీ కన్వీనర్లు గృహ సారథులు తిరిగి ప్రజలకు ఏదైతే అవసరమో తెలుసుకొని వాటిని అప్లయ్ చేయించి ఈ రోజు వాటికి సంభందించిన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,స్థానిక కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర రాఘవ, యరడ్ల అంజనేయ రెడ్డి డివిజన్ నాయకులు కార్యకర్తలు,సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు నగర పాలక సంస్థ, రెవిన్యూ అధికారులు,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.