జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, విజయవాడ
పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా
పాల్గొని అర్హులకు సంబంధిత ధృవీకరణ పత్రాలను అందించారు. ఈ సందర్బంగా వెలంపల్లి
శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం
నిరహిస్తునట్లు తెలిపారు.గడప గడపలో ప్రతి పేదవాడి సమస్య తెలుసుకొని
పరిష్కరించేందుకు సురక్ష కార్యక్రమం రూపుదిద్దుకుందన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. ఇంటి ముంగిట్లో
ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. అందరికీ
అన్నీ సంక్షేమ పథకాలు ఇచ్చేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం చేస్తున్నాం
అన్నారు.11 రకాల ధృవీకరణ పత్రాలు ఇస్తున్నామన్నారు. ప్రజలందరూ జగనన్న సురక్ష
కార్యక్రమాన్ని వినియోగించుకోవాలనీ కోరారు. ప్రజల అవసరాలు తీర్చే అందుకే
జగనన్న సురక్ష కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన నరేంద్ర
భాగ్యలక్ష్మి, మైలవరపు కృష్ణ,నృత్య అకాడమీ డైరెక్టర్ భట్టిపాటి
సంధ్యారాణి,వెన్నం రజినీ డివిజన్ నాయకులు కార్యకర్తలు,సచివాలయం కన్వీనర్లు గృహ
సారథులు నగర పాలక సంస్థ, రెవిన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.