వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
పోలాకి : అమ్మఒడితో రాష్ట్రంలో విద్యా ప్రమణాలను గణనీయంగా పెంచిన సీఎం వైఎస్
జగన్మోహనరెడ్డికి ప్రతి ఒక్కరూ జేజేలు పలుకుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం,
వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన
బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి
యేటా రూ. 15వేల ఆర్థిక సాయంతో గత నాలుగేళ్ళలో ఇప్పటివరకూ రూ. 26,067.28 కోట్లు
అందించారని పేర్కొన్నారు. పేదరికమే అర్హతగా కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గాలకు
అతీతంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఇలా ఏ పాఠశాలల్లో చదువుతున్న
విద్యార్థులకైనా పారదర్శకంగా, లంచాలకు వివక్షకు తావులేకుండా ప్రభుత్వం లబ్ధి
చేకూర్చేందుకు పని చేస్తోందని తెలిపారు. పేద విద్యార్థులు చదువుకునేలా,
పాఠశాలలో డ్రాప్ అవుట్స్‌ను గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం
అమ్మఒడి పథకాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. గత నాలుగేళ్లలో పిల్లల చదువుల
కోసం చేసే ఖర్చంతా పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడేనని అన్నారు.
విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణ వల్ల మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా
నిలిచిందని చెప్పారు. జగనన్న విద్యా కానుక, గోరుముద్ద, నాడు- నేడు, వైయస్సార్
సంపూర్ణ పోషణ, స్వేచ్ఛ (శానిటరీ నాప్కిన్స్), బైజుస్ క్లాసులు, జగనన్న విద్యా
దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలతో రాష్ట్రంలో విద్యారంగంలో
సమూలంగా ఒక విప్లవాన్నే సీఎం జగన్ తీసుకొచ్చారని ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు
తెలుపుతున్నామని ప్రకటనలో ప్రశంసించారు. రానున్న పది రోజులు పాటు జిల్లాలో
పండుగ వాతావరణం లో అమ్మఒడి కార్యక్రమాలు నిర్వహించాలని శ్రేణులకు
పిలుపునిచ్చారు.