కడప : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనపై పీసీసీ మీడియా కమిటీ
చైర్మన్ తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో
మాట్లాడుతూ ‘‘పుల్లన్న పులివెందుల సంతకు పోనూ పొయ్యాడు..రానూ వచ్చాడు ఒట్టి
చేతులతో’’ అన్నట్లుగా ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉందని సెటైర్లు విసిరారు.
జగన్ శంకుస్థాపనల స్పెషలిస్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగు స్టీల్
ప్లాంట్‌కు రెండు సార్లు శంకుస్థాపన జరిగిందని, అతీ గతీ లేదని మండిపడ్డారు.
2019, డిసెంబర్లో కుందూ – పెన్నా ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
జరిగినప్పటికీ పనులు మొదలే కాలేదన్నారు. అలాగే అదే రోజు రూ.1357 కోట్లతో
రాజోలి జలాశయం శంకుస్థాపన జరుగగా.. పురోగతి లేదన్నారు. వీటితో పాటు రూ.312
కోట్లతో జొలద రాశి జలాశయం శంకు స్థాపన జరిగిందని, ఇప్పటి వరకు ఎక్కడ వేసిన
గొంగళి అక్కడే అన్నట్లు అక్కడి పరిస్థితి ఉందని విమర్శించారు. కొప్పర్తి
పారిశ్రామిక వాడలో ప్రచారమే తప్ప పరిశ్రమలు రాలేదన్నారు. రూ.55 కోట్లతో దేవుని
కడప చెరువు సుందరీకరణ లేదని, రూ.30 కోట్లతో బుగ్గవంక సుందరీకరణ లేదని
మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు పునరావాసం పూర్తి కాలేదన్నారు.
వేంపల్లి – రాయచోటి రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయి ప్రయాణికులు భూలోకంలో యమలోకం
చూస్తున్నారన్నారు. కడపలో ఉండే బ్రౌన్ లైబ్రరీకి రూ.5.50కోట్లు ఇస్తామని
చెప్పి 5 పైసలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోవు ఎన్నికల్లో ఓడిపోయి
ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేలోపు శంకుస్థాపన చేసిన వాటిని పూర్తి చేసి
ప్రారంభోత్సవాలు చేసి దిగిపోతే మంచిది అంటూ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.