ఒంగోలు : చంద్రబాబు, పవన్ కలయిక పై ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు
సురేష్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్ళింది..బాబూ జీ హుజూర్
అని అనడానికేనని మంత్రి సురేష్ విమర్శించారు. ‘‘నువ్వు ఎన్ని సీట్లలో పోటీ
చేయమంటే.. అన్ని సీట్లలో పోటీ చేస్తాను.. నువ్వు ఏది చెబితే అది చేస్తాను అని
చెప్పడానికే’’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే జీవో నంబర్ 1
ప్రభుత్వం జారీ చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కానీ ఎల్ల్లో మీడియా జర్నలిజం
విలువలకు తిలోదకాలు ఇచ్చి వాస్తవాలను వక్రీకరిస్తుందని ఆయన మండిపడ్డారు. ఎంత
మంది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా జగన్ సింహలా సింగిల్ గానే పోటీ చేస్తారని
మంత్రి స్పష్టం చేశారు.