హైదరాబాద్ : అంబేడ్కర్.. ఆ పేరు వింటే చాలు కోట్లాది మందికి ధైర్యం. ఆయన
విగ్రహాన్ని చూస్తే చాలు మరెంతోమందికి భరోసా. అలాంటి విగ్రహాలు దేశమంతా అనేకం.
వాటన్నింటిని మించి 125 అడుగుల భారీ విగ్రహం హైదరాబాద్ నగరం నడిబొడ్డున
ఆవిష్కృతం అవుతోంది. ఏడేళ్ల క్రితం మెదిలిన ఆలోచనకు అనుగుణంగా అతిపెద్ద
అంబేడ్కర్ విగ్రహం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇవాళ అంబేడ్కర్ జయంతి రోజున
నగరం నడిబొడ్డున ఈ భారీ విగ్రహం ఠీవిగా దర్శనమివ్వబోతోంది.భారతదేశం, ప్రజలు, భవిష్యత్తు తరాలకోసం రాజ్యాంగ నిర్మాతగా సామాజిక న్యాయం
కోసం పోరాడిన యోధుడిగా అంబేడ్కర్ చేసిన కృషి, త్యాగం అజరామరం. అత్యున్నత
స్థాయిలో వారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడమంటే వారి అత్యున్నత ఆశయాలు భవిష్యత్
తరాలకు తెలియపర్చడమే. బాబాసాహెబ్ తన దూరదృష్టితో అనేక చర్చల అనంతరం, ప్రత్యేక
రాష్ట్రాల కోసం ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో రూపొందించి పొందు పరిచారని.. అదే
తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేందుకు మార్గం సుగమం చేసిందని సీఎం కేసీఆర్
పదేపదే చెబుతుంటారు. ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగించాలనే ఉద్దేశంతో అతిపెద్ద
అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు ఏడేళ్ల క్రితం బీజం పడింది. అంబేడ్కర్ 132వ
జయంతి రోజున దేశంలోనే అతి ఎత్తైన రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.