సైదాపురం 4,( వెంకటగిరి ఎక్స్ ప్రెస్)
జనం లోకి జనసేన కార్యక్రమం లో బాగంగా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు అధ్వర్యంలో ఇంటింటా జన సేన సిద్ధాంతాలను సైదాపురం మండలం చాగణం రాజు పాళెం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సేవలను సిద్ధాంతాలను పొత్తు లో బాగంగా బాబు ష్యూ రి టి పవన్ గ్యారంటీ కరపత్రాలను ఇంటింటా ప్రచారం చేస్తూ పంపిణీ చేశారు. జనసేన నాయకుడు గూడూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చాగణం రాజు పాలెం గ్రామం లో డ్రైనేజీ సమస్యలు, కాలనీ నిర్మాణాలు చేయాల్సి వుందని తమ దృష్టికి గ్రామస్తులు తీసుకు వచ్చారన్నారు. కార్యక్రమం లో జనసేన పార్టీ మండలం నాయకుడు యాటగిరి బాలు,గ్రామ జనసేననాయకులు పెంచలయ్య,ప్రవీణ్,సాయి చరణ్,చైతన్య, జశ్వంత్,సుబ్బరాజు,సందీప్,చరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు.