హామీలన్నీ పకడ్బందీగా అమలు
రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్
సారవకోట : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా సంక్షేమ పథకాలు
అందిస్తున్నారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు.
గురువారం సారవకోట మండలం అలుదు పంచాయితీ మాకివలస సచివాలయ పరిధిలో నిర్వహించిన
గడప గడపకు మన ప్రభుత్వంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల
ద్వారా చేకూరిన లబ్ధిని వివరించారు. సంక్షేమ బావుటా బుక్లెట్ పంపిణీ చేశారు.
స్థానిక సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ గ్రామంలో పిల్లల సిమ్మయ్య తాను పక్షవాతంతో బాధపడుతున్నానని కిడ్నీ వ్యాధితో
కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు వెంటనే
స్పందించిన ధర్మాన కృష్ణ దాస్ వివరాలన్నీ సేకరించి తగు వైద్యం అందేదిశగా
చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు ఇవి ఆఖరి ఎన్నికలని తెలుసని, అందుకే
లాస్ట్ చాన్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.
సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నను ఆదరించాలని ఇప్పటికే జనం
నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఈ స్థాయిలో ఎన్నికల
హామీలను అమలు చేయలేదన్నారు. ఇప్పటికే 95శాతం హామీలను పకడ్బందీగా అమలు చేసిన
ఘనత జగనన్నకే దక్కుతుందని తెలిపారు. జనవరి నుంచి సామాజిక పింఛన్ ను రూ.2,750కి
పెంచుతున్నట్లు వెల్లడించారు. గతంలో ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధుల
వద్దకు వెళ్లి చెప్పుకునేవారని, ఇప్పుడే తామే జనం ఇంటి ముంగిటకు వెళుతున్నామని
వివరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీఈసీ మెంబర్ ధర్మాన పద్మప్రియ, వైసీపీ
నాయకులు వరుదు వంశీకృష్ణ నక్క తులసీదాస్ ఎంపీడీవో విశ్వేశ్వరరావు తాసిల్దార్
ప్రవల్లికాప్రియ అధికారులు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు ప్రజా ప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు.