గుంటూరు : జనవరి 1వ తేదీన నూతన సంవత్సర, సంక్రాంతి సందర్భంగా గుంటూరు నగరంలో
ఉయ్యురు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే పేదలకు అన్నగారి జనతా వస్త్రాలు, సంక్రాంతి
కానుక పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. దీనికి
సంబందించిన స్థలం, కార్యక్రమ నిర్వహణ విధి విధానాలను మాజీ మంత్రులు ఆలపాటి
రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్ బాబు వెల్లడించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి
ఆనంద్ బాబు మాట్లాడుతూ ఉయ్యురు ట్రస్ట్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పలు
సేవా కార్యక్రమాలు నిర్వహించారని, మొదటిగా మూసి వేసిన అన్నా కాంటీన్ ల ప్లేస్
లో పేదలకు అన్నదానం చేశారన్నారు. అలాగే ఉచిత మెడికల్ క్యాంపు లు నిర్వహించి
పేదలకు అనేక పరీక్షలు ఉచితంగా చేశారని వివరించారు. అలాగే క్రిస్మస్, రంజాన్,
సంక్రాంతి కానుకలు, జనతా వస్త్రాలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా
జనవరి 1న పేదలకు అందిస్తున్న ఉయ్యురు ట్రస్ట్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అభినందనలు
తెలిపారు.