పది రోజులపాటు ఘనంగా నిర్వహణ
ఇండోర్, ఔట్ డోర్ మైదానాల్లో పోటీలు
జర్నలిస్టుల నూతన సంవత్సర వేడుకలు
అతిథులు చేతుల మీదుగా డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
సభ్యులందరికీ ప్రత్యేక కిట్ బ్యాగులు
విశాఖపట్నం : వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్
ను జనవరి 3 నుంచి 12 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్షులు గంట్ల
శ్రీను బాబు తెలిపారు. శుక్రవారం ఇక్కడ డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్
లో విశాఖ స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ సౌజన్యంతో ఈ మెగా పోటీలు
నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు నుంచి ఇండోర్ స్పోర్ట్స్, ఐదు నుంచి 12
వరకు క్రికెట్ మెగా సంబరం జరుగుతుందని, పోర్ట్ మైదానాల్లో ఆయా పోటీలు
జరుగుతాయన్నారు. ఇండోర్ కి సంబంధించి టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, షటిల్,
క్యారమ్స్ పోటీలు నిర్వహిస్తుండగా క్రికెట్ లో మొత్తం 11 జట్లు
పాల్గొంటున్నాయని వివరించారు. కార్యదర్శి దాడి రవికుమార్, ఉపాధ్యక్షులు
అర్.నాగరాజ్ పట్నాయక్, విస్జా అధ్యక్షులు ఉమా శంకర్ బాబు, ఉపాధ్యక్షులు ఎం
నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ పిటిఐ భాస్కర్, కోశాధికారి పి. భాస్కరరావు,
జర్నలిస్టు ఫోరం కార్యవర్గ సభ్యులు సంయుక్తంగా డ్రా తీసి జట్ల వివరాలను
ప్రకటించారు. ఈ కార్య క్రమంలో సభ్యులు ఇరోతి ఈశ్వర రావు, గిరి బాబు, ఎం ఎస్
ఆర్ ప్రసాద్, వరలక్ష్మి , శేఖర్ మంత్రి మాధవ రావు, గయాజ్, తదితరులు
పాల్గొన్నారు.
జర్నలిస్టుల నూతన సంవత్సర వేడుకలు : వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో
శనివారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్షులు
గంట్ల శ్రీను బాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం డాబాగార్డెన్స్ విజేఎఫ్
ప్రెస్ క్లబ్ లో కార్యదర్శి దాడి రవికుమార్ ,ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజు
పట్నాయక్ తదితరులతో కలిసి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన
సంవత్సర వేడుకలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లు సమావేశం అనంతరం శ్రీనుబాబు
పాత్రికేయులకు తెలియజేశారు. సీతమ్మ ధార విజేఎఫ్ వినోద వేధిక నార్ల వెంకటేశ్వర
రావు భవన్ లో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలతో నూతన
సంవత్సర వేడుకలు ఘనము గా ప్రారంభమవుతాయన్నారు. అనంతరం అతిధులు చేతుల మీదుగా
2023 డైరీ ,క్యాలెండర్ ను ఆవిష్కరించి సభ్యులందరికీ 10 రకాల వస్తువులతో
ప్రత్యేక కిట్ బ్యాగులు అందజేయడం జరుగుతుందన్నారు. సుమారు వెయ్యి మంది
సభ్యులకి ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జర్నలిస్టులందరికీ
2002 సంవత్సరంలో శుభం కలగాలని, అందరూ ఆయురారోగ్యాలతో కలకాలం చల్లగా ఉండాలని
కోరుకుంటున్నామన్నారు.