హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లో 562 సంక్షేమాధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టులకు 2023 జనవరి 6 నుంచి జనవరి 27 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి మరిన్ని వివరాలకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ సందర్శించాలని కమిషన్ సూచించింది. అత్యధికంగా ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 298 పోస్టులు ఉన్నాయి. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్-2 మొత్తం 140 పోస్టుల్లో ప్రీమెట్రిక్ బాలుర వసతి గృహాల్లో 87, పోస్టుమెట్రిక్ బాలుర వసతి గృహాల్లో 14, ప్రీమెట్రిక్ బాలికల వసతి గృహాల్లో 26, పోస్టుమెట్రిక్ బాలికల వసతి గృహాల్లో 13 పోస్టులు ఉన్నాయి.
ఖాళీలు ఇలా
గిరిజన సంక్షేమ వసతిగృహ అధికారులు గ్రేడ్-1 – 5; గ్రేడ్-2 – 106
ఎస్సీ సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్-2 (మహిళ) – 70; గ్రేడ్-2 (పురుషులు) – 228
* బీసీ సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్-2 – 140*
దివ్యాంగుల సంక్షేమశాఖలో వార్డెన్ గ్రేడ్ -1 – 5; వార్డెన్ గ్రేడ్-2 – 3
దివ్యాంగుల సంక్షేమశాఖలో మాట్రన్ గ్రేడ్-1 – 3; మాట్రన్ గ్రేడ్-2 – 2
చిన్నారుల సంరక్షణ గృహాల్లో లేడీ సూపరింటెండెంట్లు – 19