ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు చించివేయడాన్ని తీవ్రంగా
ఖండిస్తున్నాం
విజయవాడ : జనక్షేత్రంలో గెలవలేని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ షూటింగ్
గ్యాప్ లో వారానికి కొన్ని గంటలు ఆంధ్రాకు వచ్చి తన అభిమానులను రెచ్చగొట్టి
వెళుతున్నారనివైఎస్ఆర్ సీపీ వైద్య విభాగం ఉమ్మడి కృష్ణా జిల్లా
అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ అన్నారు. ఆ తర్వాత జనసేన కార్యకర్తలు
రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. జనసేన ఒక రాజకీయ అజెండా
లేని ఒక సైకోల గుంపుగా మారుతోంది. సీఎం ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిని
పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక టీడీపీ
అధినేత చంద్రబాబు ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే ఓటమి తప్పదని గుర్తించారు. ఇక
ఇవి తనకు 2024 ఎన్నికలే చివరివని స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు ఉన్న
పరిస్థితుల్లో వైఎస్ జగన్ కి ఉన్న జనబలం ముందు గెలవడం సాధ్యం కాదని తెలిసే
ప్రజలను రెచ్చగొడుతున్నారు. కర్నూలు జిల్లా మూడు రోజుల పర్యటనలో చంద్రబాబు ఒక
వీధిరౌడీలా మాట్లాడారు. నలుగురు కనిపిస్తే చాలు తన గొప్పలు చెప్పుకుంటున్నారు.
అదే సమయంలో ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేలా విచక్షణ రహితంగా
మాట్లాడుతున్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలను అభివృద్ధి
చేయాలని, మరోసారి ప్రాంతీయ వేర్పాటువాద ఉద్యమాలు తలెత్తకుండా ఉండేందుకు సీఎం
వైఎస్ జగన్ చిన్న వయసులోనే పెద్దగా ఆలోచించి మూడు రాజధానుల నిర్ణయం
తీసుకున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు సీఎం గారి నిర్ణయాన్ని
స్వాగతిస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు దిగజారుడు
రాజకీయాలు చేస్తూ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేదుకు కుట్రలు చేస్తున్నారు.
ఇక బీజేపీ తనను దగ్గరకు రానీడం లేదని, జనసేనను కూడా కలవనీయడం లేదని చంద్రబాబు
అసహనంతో ఒంటరిగా గెలిచే సత్తా లేక ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారు. ఈ
విషయాన్ని కర్నూలు ప్రజలు గుర్తించారు కాబట్టే అడుగడుగునా చంద్రబాబు ను
అడ్డుకుని నిరసన తెలిపారు. రానున్న రోజుల్లో చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా
ప్రజలు ఇదే విధంగా నిరసనలు తెలియజేస్తారనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హుందాగా ప్రవర్తించాలి. ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చు
పెట్టి లబ్ది పొందాలనే దుర్మార్గపు ఆలోచనలను మానుకోవాలి. తమ కార్యకర్తలకు కూడా
హుందాగా ప్రవర్తించాలని దిశానిర్దేశం చేయాలి. లేకపోతే టీడీపీ, జనసేనకు వచ్చే
ఎన్నికలే చివరి ఎన్నికలు అవుతాయి. ఆ తర్వాత కనీసం ఉనికి కూడా ఉండదన్నారు.