గుంటూరు : గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర
కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు పార్టీ అధ్యక్షులు పవన్
కళ్యాణ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా వందనం సమర్పించి జాతీయ
గీతాలాపన చేశారు. కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు
పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర,
జిల్లా కార్యవర్గం సభ్యులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.