గుంటూరు: అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ కాయగూరల లక్ష్మీపతి శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లక్ష్మీపతికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు. ఈయనతోపాటు అంబరపు వెన్నెలకృష్ణ, జి.మధుసూదన్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన అనంతపురం జిల్లా నేతలు గుండా మురళీకృష్ణ, కాశెట్టి సంజీవరాయుడు పాల్గొన్నారు.