విజయవాడ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో శనివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు ధారా. రాము , జల్లి. రమేష్ , ప్రదీప్ రాజ్, పిళ్లా .శ్రీకాంత్, సోమి మహేష్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. బిషప్ ఇజ్రాయెల్ ఇజాక్, రెవరన్డ్ అబూ సేలం,రేవారెండ్ లజారేసు,రేవారెండ్ మరియాదాస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి అనంతరం కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలకు ముందుగా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, భగవంతుడు యేసు క్రీస్తు చూపించిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ప్రేమ దయా కరుణ ప్రతి ఒక్కరి మనసులో నిండాలని, ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వేడుకని, యేసయ్య ఆశీస్సులతో రాబోయే రోజుల్లో రాష్ట్రం ఒక కొత్త నాయకత్వంలో అభివృద్ధి పథంలో నడవాలని అటువంటి నిస్వార్ధమైన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని, అటువంటి వ్యక్తికి భగవంతుడు యేసయ్య ఆశీస్సులతోపాటు రాష్ట్ర ప్రజలు సంపూర్ణ మద్దతు లభించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్, కామల్ల సోమనాదం, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ముబీన, నగర అధికార ప్రతినిధి స్టాలిన్ శంకర్, నగర కార్యదర్శులు బొట్టు. సాయి, డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్ , ఏలూరు సాయి శరత్ , రెడ్డిపల్లి గంగాధర్, సింగనం శెట్టి రాము, నగర కమిటీ సభ్యులు గన్ను శంకర్, సాబింకర్ నరేష్, బొబ్బూరి కొండలరావు, రాజా నాయుడు, పవన్ కళ్యాణ్, ఆలియా బేగం, విజయ్ కుమారి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.