ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
విజయవాడ : జనసేన, బీజేపీ పొత్తుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము
వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అవసరాల కోసం సహజంగా అనేక పార్టీ
నేతలను కలుస్తామని, గతంలో చంద్రబాబును కూడా రాష్ట్రపతికి మద్దతు ఇచ్చిన సమయంలో
కలిశామని, అలా కలిసిన వారందరితో పొత్తు ఉన్నట్లు కాదని సోము వీర్రాజు
తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని,
కలిసే ముందుకు వెళతామన్నారు. భవిష్యత్తులో కూడా జనసేన, బీజేపీ కలిసే ప్రయాణం
చేస్తుందని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు
అక్కర్లేదన్నారు. రాజకీయాల్లో కొన్ని రచనలు జరుగుతాయన్నారు. నాయకులు ఏది
మాట్లాడినా ఒక వ్యూహంతో మాట్లాడతారన్నారు.