విజయవాడ : జన సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
బుధవారం 23 వ డివిజన్ 98 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు,
కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీతో కలిసి ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు వీధి,
కోదండ రామిరెడ్డి వారి వీధి, శేషాద్రి శాస్త్రి వీధి, మల్లాది వారి వీధులలో
విస్తృతంగా పర్యటించి 110 ఇళ్లను సందర్శించారు. తొలుత స్థానిక అభయ ఆంజనేయ
స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. ఈ
సందర్భంగా ప్రజాప్రతినిధులకు స్థానికుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది.
పలువురు అవ్వాతాతలు ఎమ్మెల్యేను ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించారు.
దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పింఛన్ దారుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ
ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మల్లాది విష్ణు తెలిపారు. తెల్లవారు జామునే
గుమ్మం వద్దకు వచ్చి పింఛన్ అందిస్తుండటంతో అవ్వాతాతల మోముల్లో ఆనందం
వెల్లివిరుస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్
స్వీకరించిన ఆయన తక్షణ పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు. అలాగే ఆధార్,
ఓటర్ కార్డు అనుసంధానంలో బూత్ లెవల్ ఆఫీసర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని
ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కౌన్సిల్లో టీడీపీ సభ్యుల తీరు జుగుప్సాకరం
వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం సభ్యులు ప్రవర్తించిన తీరు
జుగుప్సాకరమని మల్లాది విష్ణు అన్నారు. పింఛన్లపై మాట్లాడే ముందు టీడీపీ
హయాంలో నగరంలో ఎన్ని పింఛన్లు ఉన్నాయో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో 15 వేల కొత్త పింఛన్లు
పెరిగాయని వెల్లడించారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 8 వేల పింఛన్లు
అధికంగా ఇస్తున్నట్లు చెప్పారు. పింఛన్ అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు
తగ్గించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో లక్షల మందికి నూతన పింఛన్లు
తీసుకునేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఈ నెల 25,616
మంది పింఛన్ దారులకు 7 కోట్ల 16 లక్షల 26 వేల 750 రూపాయలు అందిస్తున్నట్లు
మల్లాది విష్ణు తెలియజేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రూ. 1,760 కోట్లను
అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం పారిశ్రామిక
ప్రగతివైపు దూసుకెళ్తోందని, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పారిశ్రామికవేత్తలకు
స్నేహపూర్వక హస్తం అందిస్తోందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన
గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సుకు వచ్చిన అపూర్వ స్పందనే ఇందుకు
నిదర్శనమన్నారు. చంద్రబాబు పాలనలో పారిశ్రామిక అభివృద్ధి అంటే కేవలం కాగితాల
మీదనే జరిగేదని విమర్శించారు. కానీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏటా రూ. వేల
కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నట్లు వెల్లడించారు.