17 మంది మృతి…
100 మందికి గాయాలు
టోక్యో : జపాన్ వాసులు మంచు తుపాను ధాటికి వారం రోజులుగా వణికిపోతున్నారు. సంబంధిత ప్రమాద ఘటనల్లో 17 మంది చనిపోగా వంద మంది గాయపడ్డారు. వేలాదిగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తీవ్రంగా మంచు పేరుకుపోవడంతో రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈశాన్య జపాన్లో ఈ సీజన్లో సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువగా మంచు పడింది.