టోక్యో : జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ(జాక్సా) అభివృద్ధి చేస్తున్న ఓ
రాకెట్ ఇంజిన్ పరీక్షల సమయంలో పేలిపోయింది. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో
ఎవరికీ గాయాలు కాలేదని జాక్సా తెలిపింది. గతంలో ఉపయోగించిన ఎప్సిలాన్
రాకెట్‌ను అభివృద్ధి చేసి ఎప్సిలాన్-ఎస్ పేరిట ఆ సంస్థ సిద్ధం చేసింది.
ఈశాన్య జపాన్‌లోని అకితా పరీక్ష కేంద్రంలో దీన్ని పరీక్షించింది. ప్రయోగం
మొదలైన నిమిషం తర్వాత ఇంజిన్ పేలిపోయింది. దీంతో భారీ ఎత్తున మంటలు, పొగలు
వ్యాపించాయి. ఓ భనవం పైకప్పు కూలింది. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు
చేపట్టినట్లు జాక్సా పేర్కొంది.