జమ్మూ : జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ
నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆదివారం
శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పంచగవ్యప్రాశన నిర్వహించారు.
ఉదయం పుణ్యాహవచనం, పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయంతో పంచగవ్యప్రాశన
చేపట్టారు. ఆ తరువాత యాగశాలలో ఏర్పాటు చేసిన 18 హోమగుండాల్లో వాస్తుహోమం,
అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం నిర్వహించారు. సాయంత్రం అగ్ని ప్రతిష్ట,
కుంభ స్థాపన, కుంభారాధన, విశేష హోమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల
శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు, కంకణభట్టార్ రామకృష్ణ
దీక్షితులు, డెప్యూటీ ఈవోలు గుణ భూషణ్ రెడ్డి, శివప్రసాద్, ఈ ఈ సుధాకర్,
డెప్యూటీ ఈ ఈ రఘువర్మ, ఏఈవో కృష్ణారావు, ఏఈ సీతారామరాజు, సూపరింటెండెంట్
సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సాయికృష్ణ పాల్గొన్నారు.