విశాఖపట్నం : స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ నెల 24 ఫిబ్రవరి 1
వరకు నిర్వహిస్తున్న జయహో జనగణమన వారోత్సవాలు ప్రోమోను ఏయూ ఉపకులపతి ఆచార్య
పివిజిడి ప్రసాదరెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జనగణమన గీతారాపన ప్రతి భారతీయుడి భాద్యత అన్నారు. గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం
ప్లాటినం జూబ్లీ గ్రౌండ్స్ లో ఏయూ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్
సంయుక్త భాగస్వామ్యంతో జనగణమన శత వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని
గుర్తు చేసారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు, ఏయూ సైకాలజీ పరిశోధక
విద్యార్థి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విద్యార్థులలో దేశభక్తి
పెంపొందించాలనే ఉద్ధేశంతో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ చేపడుతున్న జయహో
జనగణమన కార్యక్రమం అభినందనీయమని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ న్యాయ
కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆచార్య కె. పల్లవి మాట్లాడుతూ జనగణమన
గొప్పతనం విద్యార్థులు తెలిసేలా వారోత్సవాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయం
అన్నారు. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేటి బసవ
కృష్ణ మూర్తి మాట్లాడుతూ భారత ప్రభుత్వం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన
జనగణమనను జాతీయ గీతంగా ఆమోదించి జనవరి 24కు 73 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
వారం రోజులపాటు జిల్లాలో జనగణమన గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని,
ఫిబ్రవరి ఒకటో తేదీన ముగింపు కార్యక్రమం ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా
సెంట్రల్ పార్క్ వద్ద నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని
పురస్కరించుకుని విద్యార్థులకు జనగణమన – రవీంద్రనాథ్ ఠాగూర్ అనే అంశంపై
వక్తృత్వ, వ్యాస రచన పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు
గొల్ల ప్రధీప్ రాజ్, మహమ్మద్ ఇషాక్, కర్రి నరేష్, కొయ్య రామకృష్ణ, సుధాకర్
పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.