చిలకలూరిపేట : జర్నలిస్టుందరికీ ఉచిత వైద్యం అందిస్తామని, త్వరలో
చిలకలూరిపేటలో జర్నలిస్టుల కుటుంబాల కోసం మెగా ఉచిత వైద్యశిబిరం
నిర్వహిస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి విడదల రజిని
పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ కన్వెన్షన్లో
చిలకలూరిపేట ప్రెస్ క్లబ్-ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గ ప్రమాణ
స్వీకార కార్యక్రమం జరిగింది. క్లబ్ అధ్యక్షులుగా అన్నలదాసు గిరి,
ప్రధాన కార్యదర్శిగా షేక్ అబ్దుల్ సత్తార్, కోశాధికారిగా గాయాల
వెంకట్లతోపాటు పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి విడదల రజిని మాట్లాడుతూ
విలేఖర్లకు జీతాలు ఉండవని, సమాజం పట్ల ప్రజలకు అవగాహన పెంచి వారిని
చైతన్యవంతులను చేయాలనే అభిరుచి మేరకు జర్నలిస్టులు వృత్తిలో
కొనసాగుతారని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో తాను రాజకీయ
రంగప్రవేశం చేసినటప్పటినుంచి ఇప్పటివరకు తన ప్రయాణంలో జర్నలిస్టులు
సహాయ సహకారాలు అందించారన్నారు.