శుక్రవారం నుండి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ
2 సంవత్సరాల వ్యవధితో (2023-2024) అక్రిడిటేషన్ కార్డులు మంజూరు
విజయవాడ : 2023, 2024 సంవత్సరాలకు రాష్ట్రస్థాయిలో పాత్రికేయులకు స్టేట్ లెవల్
అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసేందుకు శుక్రవారం నుండి ఆన్ లైన్ లో
దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా
విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు www.ipr.ap.gov.in
వెబ్ సైట్ ను అందుబాటులో ఉంచామన్నారు. ప్రభుత్వం క్రొత్తగా అక్రిడిటేషన్
కార్డుల మంజూరు కొరకు జీవో నంబర్ 38 (తేదీ:30.3.2023) తీసుకురావడంతో పాటు జీవో
నంబర్ 40 ద్వారా స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల నియామకం పూర్తి
చేసిన నేపథ్యంలో మొదటగా రాష్ట్రస్థాయిలో అక్రిడిటేషన్ల కార్డుల మంజూరు
ప్రక్రియ ప్రారంభించామని ఆయన తెలిపారు. జర్నలిస్టులు తమ వివరాలతో పాటు
యాజమాన్యాల సిఫారసు లేఖ, పాస్ పోర్టు సైజ్ ఫోటో, అవసరమైన డాక్యుమెంట్లు
పిడిఎఫ్ ఫార్మాట్ లో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల
శాఖ కమిషనర్ టి.విజయ కుమార్ రెడ్డి తెలిపారు.