ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం
జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు
గంట్ల శ్రీనుబాబు
విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాలకు సంబంధించి అవసర
మైన చర్యలు చేపట్టాలని, ఇందుకు ప్రభుత్వ పరంగా తగిన సహకారం అందించాలని
రాజ్యసభ సభ్యులు వి విజయసారెడ్డిని జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి వైజాగ్
జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కోరారు. ఈ మేరకు శనివారం
ప్రభుత్వ అతిథిగృహంలో ఎంపి విజయ్ సాయి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకొని
శ్రీను బాబు ఘనము గా సత్కరించారు. సింహాద్రి నాధుడు జ్ఞాపిక బహో కరించారు .
విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు సమస్య
పెండింగ్ లో ఉందని తక్షణమే వాటిని మంజూరు చేయాలని కోరారు.. ఆయా అంశాలు
ప్రభుత్వ పరంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు
సంబంధించిన అంశాలను ప్రభుత్వము దృష్టిలో పెడతామని విజయ సాయి రెడ్డి హామీ
ఇచ్చారు.